Mon Dec 23 2024 10:47:48 GMT+0000 (Coordinated Universal Time)
మెగాస్టార్ నే బెదిరించిన అనసూయ
తాజాగా అనసూయ గాడ్ ఫాదర్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ ను అనసూయ..
హైదరాబాద్ : టాలీవుడ్ యాంకర్ అనసూయ ఈ మధ్యకాలంలో వరుస సినిమాలతో బిజీగా మారింది. స్టార్ హీరోల సినిమాల్లో బంపర్ ఆఫర్లను కొట్టేస్తూ.. వరుస విజయాలు కూడా అందుకుంటోంది. తాజాగా అనసూయ గాడ్ ఫాదర్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ ను అనసూయ బెదిరించిందంటూ నెట్టింట్లో వార్తలు గుప్పుమన్నాయి. దాంతో అనసూయకు అంతుందా ? అని మెగా అభిమానులు అసలేం జరిగిందో ఆరా తీశారు. తీరా చూస్తే.. ఇదంతా జరిగింది రీల్ లో అని, రియల్ గా కాదని తెలిసి.. అభిమానులు శాంతించారు.
మోహన్ రాజా దర్శకత్వం వహిస్తోన్న గాడ్ ఫాదర్ తాజా షెడ్యూల్ లో అనసూయ- చిరు కాంబోలో కొన్ని కీలక సన్నివేశాలను తీశారట. ఈ సినిమాలో అనసూయది నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర. అయితే మొదట్నుంచీ చిరుకి సపోర్ట్ చేస్తున్నట్లే చేసి.. మధ్యలో ఎదురు తిరిగి చివరికి చిరంజీవి జైలుకెళ్లేలా చేస్తుండట. అక్కడే అనసూయకు చిరంజీవి వార్నింగ్ ఇస్తాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Next Story