Mon Dec 23 2024 07:05:41 GMT+0000 (Coordinated Universal Time)
హ్యాపీ ఫూల్స్ డే అంటూ అనసూయ ట్వీట్.. మండిపడుతున్న నెటిజన్లు
ఆమె సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా అది వివాదంగా మారిపోతుంటుంది. చాలాసార్లు అనసూయ నెటిజన్ల చేతిలో ట్రోల్స్ కి గురైంది. తాజాగా..
హైదరాబాద్ : జబర్దస్త్ యాంకర్ అనసూయ తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. పొట్టి పొట్టి డ్రస్సులతో టీవీ షోలలో అలరించే అనసూయ.. ఇప్పుడు సినిమాల్లోనూ రాణిస్తోంది. అనసూయకు అభిమానులకన్నా.. విమర్శకులే ఎక్కువ ఉంటారు. ఆమె సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా అది వివాదంగా మారిపోతుంటుంది. చాలాసార్లు అనసూయ నెటిజన్ల చేతిలో ట్రోల్స్ కి గురైంది. తాజాగా.. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అనసూయ చేసిన ట్వీట్.. నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది.
"ఓ! ప్రతి ట్రోలర్, మీమ్ మేకర్ హఠాత్తుగా మహిళలను గౌరవించడం ప్రారంభించే రోజు ఇది. అయినా ఇదంతా 24 గంటలు మాత్రమే కదా. ఆ తర్వాత అంతా మామూలు అయిపోతుంది. కాబట్టి మహిళలంతా మినహాయిస్తే.. మిగిలిన వారికి హ్యాపీ ఫూల్స్ డే. గుమ్మడికాయ దొంగలను కామెంట్స్ లో చూడొచ్చు" అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనసూయను ట్రోల్ చేస్తూ.. తెలుగు లేడీ యాంకర్లలో ఎవరిపై రాని ట్రోల్స్ మీ పై వస్తున్నాయంటే తప్పు మీలో ఉందనే కదా.. అంటూ ఫైర్ అవుతున్నారు.
Next Story