Tue Dec 24 2024 00:42:07 GMT+0000 (Coordinated Universal Time)
యాంకర్ రవిని ఇప్పటికీ వెంటాడే బాధ అదే
ఒక వ్యక్తిని గుడ్డిగా నమ్మి రూ.45 లక్షలు మోసపోయినట్లు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన యాంకర్ రవి చెప్పాడు
ఒక్కసారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లొస్తే.. ఆ సెలబ్రిటీకి ఉన్న క్రేజ్ రెట్టింపవుతుందని అందరూ అనుకుంటారు. వాళ్లకి పాపులారిటీ వస్తుందో.. లేదో.. పక్కన పెడితే.. హౌస్ లో నుంచి బయటికి వచ్చాక ఇంటర్వ్యూలతో ఫుల్ బిజీ అయిపోతారు హౌస్ మేట్స్. ఇటీవలే యాంకర్ రవి హౌస్ నుంచి బయటికి వచ్చిన విషయం తెలిసిందే. వచ్చినప్పటి నుంచి ఇంటర్వ్యూలతో క్షణం తీరిక లేకుండా బిజీ అయిపోయాడు రవి. రవి ఇస్తున్న ఇంటర్వ్యూల్లో హౌస్ ముచ్చట్లే కాకుండా.. తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నాడు.
గుడ్డిగా నమ్మి....
ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఒక వ్యక్తిని గుడ్డిగా నమ్మి రూ.45 లక్షలు మోసపోయినట్లు చెప్పాడు. ఇప్పటికీ తాను ఆ మోసం నుంచి కోలుకోలేకుండా ఉన్నానని ఎమోషనల్ అయ్యాడు. తన వద్ద చాలాకాలంగా పనిచేసిన ఓ వ్యక్తి ఉన్నట్లుండి ఒకరోజు తన వద్దకి వచ్చి అన్నా బిజినెస్ పెట్టాలి.. మా పరిస్థితి అంత బాగోలేదు. కాస్త డబ్బుసాయం చేయన్నా అని అడగడంతో ఒక్క హామీ పత్రం కూడా లేకుండా రూ.45 లక్షలు ఇచ్చేశాడు. డబ్బు తీసుకున్నాక ఒక్క నెలలో తిరిగి ఇచ్చేస్తానని చెప్పిన అతను ఆ మర్నాడు నుంచి ఇంతవరకూ రవికి కనిపించలేదట. నమ్మకస్తుడు, ఎలాంటి చెడు అలవాట్లు లేనివాడు కదా.. మోసం చేయడని నమ్మి డబ్బు ఇస్తే.. నిండా ముంచేశాడని యాంకర్ రవి వాపోయాడు.
ఉపవాసాలు, పూజలతో....
తన భార్య నిత్య మాత్రం ఇంకా ఆ డబ్బు తిరిగి వస్తుందనే నమ్మకంతో పూజలు, ఉపవాసాలు చేస్తుంటుందని, తనకైతే నమ్మకం లేదని చెప్పుకొచ్చాడు రవి. పైగా అతనికి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోవడం.. రోజూ గుడికి వెళ్లడం.. గౌరవం, వినయం చూసిన రవి అతన్ని గుడ్డిగా నమ్మి ఎలాంటి పత్రం లేకుండా రూ.45 లక్షలు ఇచ్చాడు. నెల రోజుల్లో ఇచ్చేస్తానన్న అతను ఇప్పటికీ రవి మొహం చూడడం లేదు. గతంలో ఇదే విషయాన్ని పలుమార్లు చెప్పిన రవి తాజాగా మరోసారి గుర్తు చేసుకున్నాడు. చాలా పెద్ద మొత్తం కావడంతో తన భార్య ఇప్పటికీ ఉపవాసాలు, పూజలు చేస్తుందని.. ఆ డబ్బు తిరిగి రావాలని ప్రతిరోజూ దేవుడికి మొక్కుకుంటుందని చెప్పుకొచ్చాడు రవి.
Next Story