Tue Dec 24 2024 02:09:23 GMT+0000 (Coordinated Universal Time)
Anchor Suma : స్టేజీపై క్లాసికల్ డాన్స్‌తో అదరగొట్టిన సుమ..
రీసెంట్ గా జరిగిన ఈవెంట్ లో యాంకర్ సుమ స్టేజీ పై క్లాసికల్ డాన్స్‌తో అదరగొట్టేశారు.
Anchor Suma : తెలుగు వారిని పండుగ సమయంలో, సినిమా రిలీజ్లు సమయంలో, ప్రత్యేక ఈవెంట్స్ టైములో ముందుగా పలకరించే అతిథి యాంకర్ సుమ. ఆమె లేకుండా టీవీ షోలు, సినిమా ఈవెంట్స్ జరగడం చాలా కష్టం. మలయాళీ అమ్మాయి అయిన సుమ.. తెలుగులో పలు సీరియల్స్, సినిమాల్లో నటించి యాంకర్ గా స్టార్ మహిళ అనిపించుకున్నారు. ప్రస్తుతం ఫుల్ టైం యాంకర్ గానే కొనసాగుతున్న సుమ.. మద్యమద్యలో సినిమాల్లో కూడా కనిపిస్తున్నారు.
కాగా సుమ రీసెంట్ గా 'స్పార్క్ ది లైఫ్' అనే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హోస్ట్ గా చేశారు. అయితే అక్కడ కేవలం యాంకర్ గా తన డ్యూటీ చేయడమే కాకుండా.. స్టేజీ పియా డాన్సర్స్ తో కలిసి క్లాసికల్ డాన్స్ చేసి అదుర్స్ అనిపించారు. హీరోయిన్ రుక్సార్ ధిల్లాన్ తో కలిసి సుమ డాన్స్ వేసి వావ్ అనిపించారు. పక్కన హీరోయిన్ డాన్స్ వేస్తున్నా గాని.. సుమ తన డాన్స్ తో అందర్నీ ఆకర్షించారు. అంత బాగా వేశారు సుమ. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
ఇక ఇన్నాళ్లు ఇతరుల సినిమాల ఫంక్షన్స్ కి హోస్ట్ గా చేస్తూ వచ్చిన సుమ త్వరలో తన కొడుకు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హోస్టుగా చేయబోతున్నారు. ఈ సందర్భం కోసం టాలీవుడ్ ఆడియన్స్ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ‘బబుల్ గమ్’ అనే సినిమాతో సుమ తనయుడు రోషన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. క్షణం, కృష్ణ అండ్ హిస్ లీల వంటి హిట్టు సినిమాలు తెరకెక్కించిన రవికాంత్ పేరెపు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.
న్యూ ఏజ్ లవ్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ మూవీలో రోషన్ పక్కా తెలంగాణ కుర్రడిలా తెలంగాణ యాసలో అలరించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ అండ్ టీజర్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. డిసెంబర్ 29న న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ టైములో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు.
Next Story