Mon Dec 23 2024 07:20:50 GMT+0000 (Coordinated Universal Time)
యాంకర్ విష్ణుప్రియ ఇంట విషాదం
నువ్వు నా బలం. నువ్వే నా బలహీనత. ప్రస్తుతం నువ్వు ఈ అనంత లోకంలో కలసిపోయినా.. నువ్వు నా కోసం నా ప్రతి శ్వాసలో..
ప్రముఖ టాలీవుడ్ యాంకర్ విష్ణుప్రియ ఇంట తీవ్రవిషాదం నెలకొంది. ఆమె తల్లి మహామాయ దేవి కాలంచేశారు. ఈ విషయాన్ని విష్ణుప్రియ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలిపారు. తన తల్లితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. విష్ణుప్రియ ఎమోషనల్ అయింది.
"నా ప్రియమైన తల్లి.. ఈ రోజువరకూ నాకు తోడుగా ఉన్నందుకు నీకు ధన్యవాదాలు. నా తుదిశ్వాస వరకూ నీపేరు నిలబెట్టేందుకు కృషి చేస్తాను. నువ్వు నా బలం. నువ్వే నా బలహీనత. ప్రస్తుతం నువ్వు ఈ అనంత లోకంలో కలసిపోయినా.. నువ్వు నా కోసం నా ప్రతి శ్వాసలో ఉంటావని నాకు తెలుసు. ఈ భూమి మీద నాకు మంచి జీవితాన్ని ఇవ్వడానికి నువ్వెన్ని కష్టాలు పడ్డావో నాకు తెలుసు. నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. నీత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా" అని ఆ పోస్టులో రాసుకొచ్చింది.
కాగా.. విష్ణుప్రియ "పోవే పోరా" అనే ప్రోగ్రామ్ తో యాంకర్ గా ఫేమస్ అయింది. ఇటీవల మానస్-విష్ణుప్రియ కలిసి చేసిన "జరీ జరీ పంచె కట్టి" ప్రైవేట్ సాంగ్ ఆమెకు మరింత పేరుని తెచ్చిపెట్టింది.
Next Story