Thu Dec 26 2024 14:09:42 GMT+0000 (Coordinated Universal Time)
లైఫ్లో ఈ మూడు విషయాలు చేస్తే చాలు.. సక్సెస్ అవుతారట..
ఆచార్య చాణక్యుడు ఆ మూడు ఫాలో అవుతే చాలు సక్సెస్ అవుతామని చెబుతున్నారు. అవేంటో ఆర్టికల్ పూర్తిగా చదివి తెలుసుకోండి.
ప్రస్తుతం ఉన్న మెకానికల్ లైఫ్ లో ప్రతి ఒక్కరు ఒక సపోర్ట్ కోసం, ఒక మార్గదర్శి కోసం, ఒక సలహా కోసం ఎదురు చూస్తుంటారు. లైఫ్ లో గమ్యం చేరేందుకు ఏం చేయాలో తెలియక చాలా మంది తికమకలో ఉంటుంటారు. అయితే జీవితంలో ఏం చేస్తే సక్సెస్ అవ్వొచ్చు అనేది భారత ఆర్థికవేత్త, దౌత్య వేత్త అయిన ఆచార్య చాణక్యుడు ఎప్పుడో చెప్పారు.
ఎన్నో విషయాలను బోధించిన చాణక్యుడు.. నీతి శాస్త్రం పై కూడా కొన్ని బోధనలు చేశారు. మంచి చెడులను వివరిస్తూనే లైఫ్ లో ఏం చేస్తే ఆనందాన్ని పొందగలం, ఏం చేస్తే సక్సెస్ ని అందుకోగలమో అనే విషయాలని కూడా వివరించారు. వాటిలో మూడు విషయాలను ముఖ్యంగా ప్రస్తావించారు. ఆ మూడు ఫాలో అవుతే చాలట సంతోషం, సక్సెస్ చెంతకు వస్తాయని చెబుతున్నారు. అవేంటో ఆర్టికల్ పూర్తిగా చదివి తెలుసుకోండి.
మొదటిది నిజాయితీ. నిజాయితీ ఉన్న వ్యక్తి ఎప్పటికైనా విజయం సాధిస్తారని చెప్పుకొచ్చారు. నిజాయితీ లేని వ్యక్తి విజయాన్ని సాధించినప్పటికీ అది ఎక్కువ కాలం ఉండదని పేర్కొన్నారు. అంతేకాదు వారు ఎప్పుడు లోలోపల బయపడుతుంటారని. వారికీ జీవితంలో అదే పెద్ద శిక్ష అని చెప్పుకొచ్చారు.
రెండోది సోమరితనం పక్కన పెట్టడం. మనిషికి అదే అతిపెద్ద శత్రువు అని పేర్కొన్నారు. కష్టపడే సామర్థ్యం, ఆలోచన లేని వారు జీవితంలో అసలు రాణించలేరని. ఒకవేళ వారికీ అన్ని ఉన్న శ్రమ పడే ఆలోచన లేకపోతే పతనం అవ్వడం ఖాయం అని వెల్లడించారు.
మూడోది మాట పొదుపు. పనికిరాని విషయాలు గురించి, ఇతర జీవితాల విషయాల గురించి మాట్లాడడం వాళ్ళ సమస్యలు ఎదుర్కోవడం, వివాదాల్లో చిక్కుకోవడం జరిగి సమాజంలో తమ గౌరవాన్ని పోగుట్టుకుంటారని చెప్పుకొచ్చారు.
Next Story