Mon Dec 23 2024 15:26:13 GMT+0000 (Coordinated Universal Time)
RRR సినిమాకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
RRR సినిమా టిక్కెట్ల ధరలను పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
RRR సినిమా టిక్కెట్ల ధరలను పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టిక్కెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. మొదటి పది రోజులు టిక్కెట్ల రేట్లు పెంచుకోవచ్చని మంత్రి పేర్ని నాని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో మేరకు టిక్కెట్లను పెంచుకునే వెసులుబాటు RRR సినిమాకు ఉందని పేర్ని నాని తెలిపారు. RRR సినిమాకు 336 కోట్లు ఖర్చయిందని ఆ సినిమా నిర్మాతలు చెప్పారని మంత్రి తెలిపారు. దీనిపై త్వరలోనే జీవో విడుదల చేస్తుందని చెప్పారు.
మొదటి పది రోజులు....
ఆన్ లైన్ టిక్కెట్ కోసం రెండు కంపెనీలు టెండర్లు వేశాయని, వాటిని ఫైనలైజ్ చేస్తామని పేర్ని నాని తెలిపారు. ఇటీవల RRR సినిమా దర్శకుడు రాజమౌళి ముఖ్యమంత్రి జగన్ ను కలిసి వెళ్లిన సంగతి తెలిసిందే. ఎక్కువ ఖర్చు పెట్టి తీసిన సినిమాలకు ప్రభుత్వం టిక్కెట్లు రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది.
Next Story