Sun Jan 12 2025 18:47:44 GMT+0000 (Coordinated Universal Time)
మెగా, నందమూరి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టిక్కెట్ల ధర పెంపునకు అనుమతిస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ిసినిమా టిక్కెట్ల ధర పెంపునకు అనుమతిస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 12న నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి, 13న మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలు విడుదలవుతున్న సందర్భంగా ఏపీ ప్రభుత్వంఈ నిర్ణయం తీసుకుంది.
వీరయ్యకు రూ25లు.. సింహారెడ్డికి రూ.20లు...
వీరసింహారెడ్డి సినిమాకు టిక్కెట్ పై ఇరవై రూపాయలు, వాల్తేరు వీరయ్య సినిమాకు ఇరవై ఐదు రూపాయలు పెంచుకునేందుకు వీలుగా థియేటర్ల యాజమాన్యాలకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండో భారీ బడ్జెట్ సినిమాలే కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వ వర్గాలు వెల్లడిచాయి.
Next Story