Mon Dec 23 2024 16:37:03 GMT+0000 (Coordinated Universal Time)
Mahesh Babu : మహేష్ బాబు మీద సీరియస్ అయిన అనిల్ కపూర్..
యానిమల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ పై సీరియస్ అయ్యిన అనిల్ కపూర్. ఆయన ఎందుకు ఫైర్ అయ్యారు.
రణబీర్ కపూర్ హీరోగా సందీప్ వంగా డైరెక్ట్ చేసిన 'యానిమల్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ సోమవారం రాత్రి ఘనంగా ఉంది. ఈ ఈవెంట్ కి చిత్ర యూనిట్ రణబీర్, రష్మిక మందన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్ తో పాటు ముఖ్య అతిథులుగా మహేష్ బాబు, రాజమౌళి హాజరయ్యారు. ఇక ఈ ఈవెంట్ లో అనిల్ కపూర్ వేదిక మీద మాట్లాడుతూ మహేష్, రణబీర్ పై సీరియస్ అయ్యారు. ఆయన ఎందుకు ఫైర్ అయ్యారు.
అనిల్ కపూర్ అనగానే మనకి ఏక్ ధోన్ తీన్ అంటూ చాలా డాన్స్ నెంబర్స్ గుర్తుకు వస్తాయి. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయనను ఒక చిన్న డాన్స్ స్టెప్ వేయమని కోరారు. దానికి ఆయన అంగీకరించి మహేష్ సాంగ్ ప్లే చేయండి చేస్తాను అంటూ చెప్పుకొచ్చారు. అయితే క్రింద ఉన్న మహేష్, రణబీర్ ని కూడా వేదిక మీదకి వచ్చి తనతో డాన్స్ వేయాలని కోరారు. మహేష్ బాబుకి ఉన్న సిగ్గు గురించి తెలిసిందేగా.
ఆయన వేదిక పై డాన్స్ వేయడం అనేది 'సర్కారీ వారి పాట' సక్సెస్ సెలబ్రేషన్స్ లోనే చూశాము. అలా డాన్స్ చేయడం మొదటిసారి. ఇక యానిమల్ ఈవెంట్ లో అనిల్ కపూర్ పిలుస్తుంటే మహేష్ బాబు మొహమాటంతో పైకి రావడానికి నిరాకరించారు. ఆయన రెండు మూడుసార్లు అడిగిన మహేష్.. రాను అంటూనే బదులిచ్చారు. మహేష్ కదలకపోవడంతో రణబీర్ కూడా అక్కడే కూర్చొని ఉండిపోయారు. దీంతో అనిల్ కపూర్ సీరియస్ అయ్యారు.
ఒక సీనియర్ యాక్టర్ ని అడుగుతున్నా మీరు పైకి రారా అంటూ ఫైర్ అయ్యారు. "మీ సీనియర్ గా మిమ్మల్ని స్టేజి పైకి రమ్మని ఆర్డర్ చేస్తున్నాను. మీరు ఇప్పుడు వస్తారా రారా" అని గట్టిగా అనడంతో మహేష్ బాబు కదిలారు. రణబీర్ తో కలిసి వచ్చి అనిల్ కపూర్ అండ్ బాబీ డియోల్ తో కలిసి పోకిరి మూవీలోని ‘డొలె డొలె’ సాంగ్ డాన్స్ వేశారు. అక్కడ కూడా మహేష్ జస్ట్ ఒక చిన్న స్టెప్ వేసి ముగించేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Next Story