Sun Dec 14 2025 23:30:52 GMT+0000 (Coordinated Universal Time)
Malaika Arora Father మలైకా తండ్రి చివరి మాటలు ఇవే!!
అనిల్ కుల్దీప్ మెహతా చనిపోయే కొద్ది క్షణాల ముందు అతను తన కుమార్తెలు నటి మలైకా అరోరా, అమృతా అరోరాకు చివరి ఫోన్ కాల్

అనిల్ కుల్దీప్ మెహతా ఆత్మహత్య చేసుకుని చనిపోయే కొద్ది క్షణాల ముందు అతను తన కుమార్తెలు నటి మలైకా అరోరా, అమృతా అరోరాకు చివరి ఫోన్ కాల్ చేసాడు. "నేను అనారోగ్యంతో ఉన్నాను. అలసిపోయాను," అని అతను వారికి చెప్పినట్లు ఇండియా టుడే తెలిపింది. తండ్రి మరణించిన వార్త తెలుసుకుని మలైకా ఇతర కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఇన్స్టాగ్రామ్లో మలైకా ఒక ప్రకటనను విడుదల చేసింది. తండ్రి మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసింది. "మా ప్రియమైన తండ్రి అనిల్ మెహతా మరణించినందుకు మేము ఎంతో దుఃఖంలో ఉన్నాం. ఆయన ఒక మంచి వ్యక్తి, ఓ తాతగా, భర్తగానే కాదు, ఓ మంచి తండ్రి కూడా. మా ప్రాణ స్నేహితుడుగా కూడా ఉన్నారు. ఈ నష్టంతో మా కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ఇలాంటి క్లిష్ట సమయంలో మీడియా గోప్యత పాటించాలని అభ్యర్థిస్తున్నాం" అని మలైకా పోస్టు పెట్టింది.
అనిల్ మెహతా (65) బుధవారం ఉదయం బాంద్రాలోని తన నివాసంలోని ఆరో అంతస్తు నుంచి దూకి చనిపోయారు. ఈ ఘటన జరిగినప్పుడు మెహతా భార్య జాయిస్ పాలీకార్ప్ బాంద్రాలోని అయేషా మనోర్లోని వారి ఫ్లాట్లో ఉన్నారు. ఉదయం 9 గంటల సమయంలో గదిలో తన భర్త చెప్పులు కనిపించడం, అతని కోసం వెతికానని.. ఏదో భయంకరమైన తప్పు జరిగిందని నేను గ్రహించానని ఆమె పోలీసులకు తెలిపారు. అతను దూకడానికి కొద్దిసేపటి ముందు తన కుమార్తెలిద్దరినీ సంప్రదించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మలైకా పూణెలో ఓ ఈవెంట్కు వెళుతుండగా ఆమెకు తండ్రి నుండి కాల్ వచ్చింది.
Next Story

