Mon Dec 23 2024 10:27:54 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్ఆర్ఆర్ లో చెర్రీ, తారక్ ల రెమ్యునరేషన్ ఎంత ?
RRRలో హీరోల రెమ్యునరేషన్ గురించి అనిల్ రావిపూడి ప్రశ్నించారు. చరణ్ ను ‘ఈ సినిమాకు మీ రెమ్యూనరేషన్ ఎంత?’ అని అడగడంతో..
హైదరాబాద్ : RRR సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుంది. మరికొన్ని రోజుల్లో టాలీవుడ్ బిగ్గెస్ట్ ఫీస్ట్ మొదలవ్వనుంది. ఈ నేపథ్యంలో సినిమా బృందం ప్రమోషన్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లపై దృష్టి సారించింది. ఈ నెల 19న కర్ణాటక లో RRR కన్నడ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఇక తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన అప్ డేట్ ఇంతవరకూ ఇవ్వలేదు. కానీ.. జక్కన్న సహా.. తారక్, చరణ్ లు వరుసగా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు.
ప్రమోషన్లలో భాగంగా ఓ ఛానల్ లో దర్శకుడు అనిల్ రావిపూడి RRR టీమ్ తో చిట్ చాట్ నిర్వహించారు. ఈ చిట్ చాట్ లో చాలా ఆసక్తికర విషయాలు తెలిశాయి. మార్చి 25న RRR విడుదల కానుండగా.. తారక్ భార్య ప్రణతి పుట్టిన రోజు మార్చి 26 కాగా, రామ్ చరణ్ బర్త్ డే మార్చి 27. ఈ సందర్భంగా జూ.ఎన్టీఆర్ తన భార్య పుట్టినరోజు ఎలా జరిగేదో చెప్పుకొచ్చారు. చాలా సంవత్సరాల పాటు ప్రణతి బర్త్ డే పూర్తి కాగానే, రాత్రికి రాత్రి చరణ్ కారులో తాను బయటకు వెళ్ళిపోయేవాడినని, ప్రణతి ఫోన్ చేసి ఎక్కడికి వెళ్ళిపోయారు అని అడిగితే, నీ పుట్టినరోజు హడావుడీ అయిపోయింది కదా.. చెర్రీతో బయటకు వచ్చానని చెప్పేవాడినని అన్నాడు. అలా ఎన్నో పుట్టిన రోజులు రామ్ చరణ్ తో గడిపానని తెలిపాడు.
ఇక RRRలో హీరోల రెమ్యునరేషన్ గురించి అనిల్ రావిపూడి ప్రశ్నించారు. చరణ్ ను 'ఈ సినిమాకు మీ రెమ్యూనరేషన్ ఎంత?' అని అడగడంతో.. ఈ ప్రశ్నకు కూడా తారక్ జవాబు చెబుతాడని, దానిని పాస్ చేశాడు. దానికి తారక్ నవ్వుతూ, 'నీకు ఎంత కావాలో అడుగు, నాకూ అంతే ఫిక్స్ చేయి అని చెర్రీ తనతో అన్నాడ'ని బదులిచ్చాడు. RRR హీరోల రెమ్యునరేషన్ గురించి.. సినిమా మొదలైనప్పటి నుంచి చర్చ జరుగుతూనే ఉంది. కానీ స్టార్ హీరోలు అలాంటి సీక్రెట్లు ఎక్కడా చెప్పరు కదా. అనిల్ రావిపూడి అడిగిన ప్రశ్నకు జక్కన్న సమాధానమిచ్చారు. ఆర్ఆర్ఆర్ లో హీరోలు రెమ్యునరేషన్ కు ప్రాధాన్యమివ్వకుండా.. ఎన్నో త్యాగాలు చేసి సినిమా చేశారని కితాబిచ్చారు. నిజానికి ఈ సినిమాకు వాళ్ళు డెడికేట్ చేసిన రోజుల్ని పరిగణనలోకి తీసుకుంటే మరో రెండు మూడు సినిమాలు చేసి ఉండేవారన్నారు.
News Summary - Anil Ravipudi Chit Chat with RRR Team ; Tarak Interesting Comments on Charan Remuneration in RRR
Next Story