Sun Dec 22 2024 22:11:57 GMT+0000 (Coordinated Universal Time)
Bhagavanth Kesari : 'భగవంత్ కేసరి' దర్శకుడికి కాస్టలీ కారు గిఫ్ట్.. ఎంతో తెలుసా..?
బాలయ్యకి గుర్తుండిపోయే సినిమా ఇచ్చిన అనిల్ రావిపూడికి నిర్మాత కాస్టలీ కారుని గిఫ్ట్గా ఇచ్చారు. దాని విలువ ఎంతో తెలుసా.?
Bhagavanth Kesari : 'ఈ సినిమా షానా ఏండ్లు యాదుంటది' అంటూ దసరాకి ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్టుని అందుకున్న 'భగవంత్ కేసరి' నందమూరి బాలకృష్ణకు కూడా గుర్తుండిపోయే చిత్రం అయ్యింది. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్ల కలెక్షన్స్ ని అందుకున్న బాలయ్య.. భగవంత్ కేసరితో కూడా 100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టి హ్యాట్రిక్ హిట్టు అందుకోవాలని ఫ్యాన్స్ ఆశించారు.
బాలయ్య, శ్రీలీల, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. రూ.130 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టింది. ఇక వరుసగా మూడుసార్లు 100 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టి.. ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోల్లో (చిరంజీవి, వెంకటేష్, నాగార్జున) బాలయ్య రికార్డు క్రియేట్ చేశారు. రీసెంట్ గా ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయగా అక్కడ కూడా రికార్డు వ్యూస్ అందుకుంటుంది.
ఇక ఈ చిత్రాన్ని బాలీవుడ్ రిలీజ్ కి కూడా సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం బాలయ్య తన పాత్రకి తానే హిందీ డబ్బింగ్ కూడా చెప్పారు. కాగా ఈ మూవీ బాగా లాభాలు తెచ్చిపెట్టడంతో నిర్మాత ఫుల్ ఖుషీ మీద ఉన్నారు. దీంతో తమకి ఇంతటి హిట్టు ఇచ్చిన అనిల్ రావిపూడికి కాస్టలీ గిఫ్ట్ ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేశారు. బ్రాండ్ న్యూ టొయోట వెల్ఫైర్ కారుని దర్శకుడికి బహుమతిగా అందజేశారు. ఈ కారు విలువ ప్రస్తుతం మార్కెట్ లో రూ.1.20 నుంచి రూ.1.30 కోట్ల విలువ ఉంది.
కాగా బాలయ్యకి బ్లాక్ బస్టర్ అందించిన అనిల్ రావిపూడి.. ఇప్పుడు చిరంజీవికి కూడా ఒక సూపర్ హిట్టుని అందించేందుకు సిద్దమవుతున్నారట. ఆల్రెడీ చిరుకి కథని కూడా వినిపించారని, ఆల్మోస్ట్ ఈ కాంబినేషన్ సెట్ అయ్యిపోయిందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఇక ఈ సినిమాని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించబోతున్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారని చెబుతున్నారు.
Next Story