Mon Dec 23 2024 11:39:02 GMT+0000 (Coordinated Universal Time)
ఎఫ్3 షూటింగ్ జర్నీ పూర్తి.. ఇక మీ నవ్వుల జర్నీ షురూ !
ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా తెరకెక్కిన సినిమా ఎఫ్3. ఈసారి ఈ ఇద్దరితో
ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా తెరకెక్కిన సినిమా ఎఫ్3. ఈసారి ఈ ఇద్దరితో పాటు కామెడీ హీరో సునీల్ కూడా తోడయ్యారు. ఈ సినిమాలో ఎఫ్2 మాదిరిగానే.. తమన్నా, మెహ్రీన్ లు వెంకటేష్, వరుణ్ ల సరసన నటిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ సినిమా. అందుకే షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేశామని.. ఇక నవ్వుల పండుగేనంటూ దర్శకుడు అని రావిపూడి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ఓ చిన్న వీడియోను యాడ్ చేశారు. అందులో అంతా ఎఫ్2 నటీనటులే ఉన్నారు ఒక్క సునీల్ తప్ప. అంటే ఎఫ్3లో ఎవరెవరు కొత్తగా ఉన్నారో తెలియకుండా జాగ్రత్తపడ్డాడు అనిల్ రావిపూడి. ఈ కామెడీ ఎంటర్టైనర్ కు దిల్ రాజు నిర్మతగా వ్యవహరించారు. అంతా బాగుంటే ఈ ఏడాది ఏప్రిల్ 28న ఎఫ్3 థియేటర్లలో విడుదల కానుంది.
News Summary - Anil Ravipudi's F3 Movie Shooting Completed. Makers planning to release the movie on april 28th
Next Story