Mon Dec 23 2024 02:22:17 GMT+0000 (Coordinated Universal Time)
పార్లమెంట్ ను తాకిన యానిమల్ సినిమా
బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ హీరోగా నటించిన ‘యానిమల్’ మూవీ బాక్సాఫీస్
బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ హీరోగా నటించిన ‘యానిమల్’ మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుంది. మొదటిరోజు నుంచే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను పరుగులు పెట్టిస్తుంది. మొదటిరోజు ఈ సినిమా రూ.116 కోట్లు వసూలు చేయగా.. రెండో రోజు ఏకంగా రూ.236 కోట్లు వసూలు చేసింది. ఇక మూడో రోజు వరల్డ్‌వైడ్‌గా రూ.356 కోట్లు వసూళ్లు రాబట్టింది. తాజాగా ఈ చిత్రం రూ.563 కోట్లతో దూసుకుపోతుంది. ఈ సినిమా గురించి పార్లమెంట్ దాకా వెళ్ళింది.
యానిమల్ మూవీపై ఛత్తీస్‌గఢ్ ఎంపీ రంజీత్ రంజన్ మాట్లాడుతూ.. సినిమాను చూడడానికి వెళ్లిన తన కూతురు ఏడుస్తూ బయటకు వచ్చిందని అన్నారు. నా కూతురు తన ఫ్రెండ్స్ కలిసి యానిమల్ సినిమాకు వెళ్లింది. సినిమా మధ్యలోనే ఆమె ఏడుస్తూ బయటికి వచ్చేసింది. సినిమాలో హింస, మహిళలపై వేధింపులు సన్నివేశాలు చాలా ఉన్నాయని అన్నారు. అలాంటివి చూపించడం నాకు నచ్చదు. కబీర్ సింగ్ సినిమాలో హీరో తన భార్య, సమాజాన్ని, తోటి మనుషులతో చాలా అగ్రెసీవ్ బిహేవ్ చేస్తాడు. పైగా అలాంటి పాత్రలే కరెక్ట్ అన్నట్లుగా చూపిస్తున్నారు. ఇది కచ్చితంగా ఆలోచనను రేకెత్తించే అంశమే అవుతుంది. ఇలాంటి సినిమాలు ఇంటర్ చదివే పిల్లలపై ప్రభావం చూపిస్తాయి. అలాంటి వారిని రోల్ మోడల్ గా భావిస్తున్నారు.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు రంజీత్ రంజన్. సినిమా అనేది సమాజానికి అద్దం లాంటిది. మనం సినిమాలు చూస్తూ పెరిగాం.. అది యువతను ప్రభావితం చేయగలదన్నారు. మొదట కబీర్ సింగ్, పుష్ప లాంటి సినిమాలు వచ్చాయి, ఇప్పుడు యానిమల్ వచ్చింది. నా కూతురు తన కాలేజీ స్నేహితులతో కలిసి సినిమా చూడటానికి వెళ్లి, ఏడుపు ఆపుకోలేక మధ్యలోనే బయటకు వెళ్లిపోయిందన్నారు.
Next Story