Mon Dec 23 2024 15:37:40 GMT+0000 (Coordinated Universal Time)
Animal : బాబీ డియోల్ ఎంట్రీ సాంగ్లో కనిపించిన అమ్మాయి ఎవరో తెలుసా..?
బాబీ డియోల్ ఎంట్రీ సాంగ్లో కనిపించిన అమ్మాయి ఎవరో తెలుసా? అలాగే ఆ సాంగ్ కి అందాల భామలు చేస్తున్న రీల్స్ కూడా చూసేయండి.
Animal : రణబీర్ కపూర్, రష్మిక మందన్న, తృప్తి దిమ్రీ హీరోహీరోయిన్లుగా సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన యాక్షన్ వైలెంట్ మూవీ 'యానిమల్'. బాబీ డియోల్, అనిల్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం బోల్డ్ అండ్ వైల్డ్ కంటెంట్ తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. ఇక ఈ చిత్రంలో రణబీర్, బాబీ డియోల్ ఎంట్రీ యూత్ ని బాగా ఆకట్టుకున్నాయి. వారిద్దరి ఎంట్రీకి సందీప్ వంగ ఉపయోగించిన మ్యూజిక్ బిట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
రణబీర్ ఎంట్రీకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం చేసిన ‘చిన్ని చిన్ని ఆశ’ మ్యూజిక్ బిట్ ని ఉపయోగిస్తే, బాబీ డియోల్ ఎంట్రీకి ఇరానియన్ ఓల్డ్ సాంగ్ 'జమాల్ కుడు'ని ఉపయోగించారు. మూవీలో ఈ సాంగ్ ని కొందరు అమ్మాయిలు కలిసి పడుతూ కనిపిస్తారు. అయితే వారిలో మిడిల్ లో మెయిన్ సింగర్ గా ఉన్న అమ్మాయి స్మైల్ కి మన ఆడియన్స్ ఫిదా అయ్యారు. దీంతో ఆమె ఎవరని సోషల్ మీడియాలో వెతకడం మొదలు పెట్టారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు..? ఏం చేస్తుంటది..?
ఆ అమ్మాయి అసలు పేరు 'తన్నాజ్ దవూది' (Tannaz Davoodi). ఇరాన్ కి చెందిన ఈ అమ్మాయి మోడలింగ్ చేసింది. డాన్సర్ గా పలు స్టేజి షోల్లో బాలీవుడ్ సాంగ్స్ కి పర్ఫామెన్స్ ఇచ్చింది. విదేశాల్లో బాలీవుడ్ స్టార్స్ నోరా ఫతేహి, వరుణ్ ధావన్, జాన్ అబ్రహం, సన్నీ లియోన్ లతో కలిసి డాన్స్ షోలు ఇచ్చింది. అయితే ఆ స్టేజి షోలతో రాని గుర్తింపు తన్నాజ్కి.. ఈ జమాల్ కుడు సాంగ్ తో వచ్చింది. ఈ పాటతో ఫేమ్ తెచ్చుకోవడంతో.. తన్నాజ్ సోషల్ మీడియా ఫాలోవర్స్ అకౌంట్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
కాగా ఈ మ్యూజిక్ బిట్కి, బాబీ డియోల్ డాన్స్కి అట్రాక్ట్ అయిన యూత్.. దానిని రీ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియా రీల్స్ చేస్తున్నారు. అందాల భామలు చేస్తున్న ఆ రీల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాటి వైపు ఒక లుక్ వేసేయండి.
Next Story