Sun Jan 12 2025 23:55:49 GMT+0000 (Coordinated Universal Time)
జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా అన్నీ మంచి శకునములే ట్రైలర్ లాంచ్
ఈ సినిమా నుండి వచ్చిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఇప్పటికే మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. ఈ సినిమాపై ప్రేక్షకులకు మరింత..
సంతోష్ శోభన్ - మాళవిక నాయర్ జంటగా.. డైరెక్టర్ నందిని రెడ్డి తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం అన్నీ మంచి శకునములే. ఈ సినిమా నుండి వచ్చిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఇప్పటికే మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. ఈ సినిమాపై ప్రేక్షకులకు మరింత ఆసక్తిని పెంచేందుకు ప్రమోషన్స్ షురూ చేసింది చిత్ర యూనిట్. ఈ క్రమంలో తాజాగా సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ ట్రైలర్ ను రిలీజ్చేశారు.
ట్రైలర్ మొదలు నుంచి చివరి వరకూ ప్రేక్షకులను ఆకట్టుకునేలా కట్ చేశారు. రెండు ఫ్యామిలీల మధ్య జరిగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సినిమాను రూపొందించారు. ఈ కథలో క్యూట్ లవ్ స్టోరీని చూపించనున్నారు. సంతోష్ శోభన్, మాళవిక నాయర్ల మధ్య కెమిస్ట్రీ ట్రైలర్లో చాలా బాగుంది. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా.. స్వప్న సినిమా బ్యానర్ పై ప్రియాంక దత్ సినిమాను నిర్మించారు. మే 18న వేసవి కానుకగా అన్నీ మంచి శకునములే థియేటర్లలో విడుదల కానుంది.
Next Story