Mon Dec 23 2024 12:16:09 GMT+0000 (Coordinated Universal Time)
HCA అవార్డుల ఫంక్షన్ లో రామ్ చరణ్ కు అరుదైన ఘనత
అమెరికాలోని బెవెర్లీ హిల్స్ లో ఫిబ్రవరి 24, శుక్రవారం రాత్రి జరిగిన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు ఫంక్షన్ కు..
టాలీవుడ్, పాన్ ఇండియా స్టార్ హీరో రామ్ చరణ్ మరో అరుదైన ఘనతను తన సొంతం చేసుకున్నాడు. అమెరికాలోని బెవెర్లీ హిల్స్ లో ఫిబ్రవరి 24, శుక్రవారం రాత్రి జరిగిన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు ఫంక్షన్ కు రామ్ చరణ్ ప్రజెంటర్ గా విచ్చేశారు. ఈ అవార్డుల ఫంక్షన్ లో ఆయనకు బెస్ట్ వాయిస్ ఓవర్ అవార్డును ప్రకటించారు. ఇదే అవార్డుల ఫంక్షన్లో RRR సినిమా ఏకంగా నాలుగు అవార్డులను అందుకుంది.
బెస్ట్ మూవీ, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్, బెస్ట్ స్టంట్స్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డులు అందుకుంది. గతంలో HCA స్పాట్ లైట్ అవార్డును కూడా ప్రకటించడంతో.. మొత్తం ఐదు హెచ్ సీఏ అవార్డులను RRR కైవసం చేసుకుంది. మార్చ్ 12న జరిగే ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ కోసం ఇప్పటికీ చిత్రబృందం అమెరికా చేరుకుంది. మార్చ్ 16న విడుదల కానున్న క్రిటిక్స్ సూపర్ అవార్డ్స్ ఉత్తమ నటుడు అవార్డుకు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నామినేట్ అయ్యారు.
Next Story