మహేష్ కి మరో అవార్డు!
మహేష్ బాబు 40 ఏళ్ళ వయసులో కూడా 20 ఏళ్ళ కుర్రాడిలా ఫిట్ గా ఉండడమే కాదు.. మెరిసిపోయే మేలిమి ఛాయతో ముట్టుకుంటే డాగడిపోతాడా అనే మాదిరి [more]
మహేష్ బాబు 40 ఏళ్ళ వయసులో కూడా 20 ఏళ్ళ కుర్రాడిలా ఫిట్ గా ఉండడమే కాదు.. మెరిసిపోయే మేలిమి ఛాయతో ముట్టుకుంటే డాగడిపోతాడా అనే మాదిరి [more]
మహేష్ బాబు 40 ఏళ్ళ వయసులో కూడా 20 ఏళ్ళ కుర్రాడిలా ఫిట్ గా ఉండడమే కాదు.. మెరిసిపోయే మేలిమి ఛాయతో ముట్టుకుంటే డాగడిపోతాడా అనే మాదిరి కనిపిస్తాడు. రాజకుమారుడు సినిమాలో ఎంత ఫిట్ గా అందంగా ఉన్నాడో.. నిన్నమొన్నటి సరిలేరు నీకెవ్వరు సినిమాలోనూ అంతే అందంగా ఫిట్ గా ఉన్నాడు. సర్కారు వారి పాట కోసం జిమ్ లో కష్టపడుతున్న మహేష్ బాబు పిక్ ఆ మధ్యన సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇక సూపర్ స్టార్ గా ఎన్నో సినిమాలకు అవార్డులను అందుకున్న మహేష్ బాబు రీసెంట్ గా.. Synth Global Spa Fit and Fab Wellness Icon అవార్డు అందుకున్నాడు.
ఫిట్నెస్ విషయంలో మహేష్ కి ఆ అవార్డుని ప్రెజెంట్ చేసారు. అదే విషయాన్ని మహేష్ తన ఇన్స్టా గ్రామ్ నుండి అందరికి తెలియజేయడమే కాదు.. తనకు ఆ అవార్డు అందజేసిన వారికి ధన్యవాదాలు కూడా తెలియజేసాడు మహేష్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సర్కారు వారి పాట తర్వాత మహేష్ ఓ సన్సేషనల్ దర్శకుడితో తన నెక్స్ట్ మూవీ చెయ్యబోతున్నాడు.
- Tags
- mahesh babu