రాంగోపాల్ వర్మ మరో కొత్త సినిమా.. స్టోరీ ఎంటో తెలుసా?
సినిమాలో ఎన్నో చేశారు. రాజకీయ ప్రముఖుల జీవిత కథ ఆధారంగా రూపొందించిన సినిమాలను తీసిన వర్మకు ఎన్నో వివాదాలు..
రాంగోపాల్ వర్మ ఏదీ చేసిన అది సంచలనమే ఉంటుంది. ఏ సినిమా తీసినా అది కాంట్రవర్సికి కేరాఫ్ అడ్రస్. ఇప్పటికే వివాదాలకు దారి తీసే సినిమాలో ఎన్నో చేశారు. రాజకీయ ప్రముఖుల జీవిత కథ ఆధారంగా రూపొందించిన సినిమాలను తీసిన వర్మకు ఎన్నో వివాదాలు ఎదురయ్యాయి. అయినా వాటిని ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నారు. ఇప్పుడు తాజాగా మరో సినిమాను తెర మీదకెక్కిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా సినిమా తీయగా, ఇప్పుడు వైఎస్ ఆర్ మరణంపై ‘వ్యూహం’ సినిమా చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా ఏపీలోని ప్రకాశం బ్యారేజి పై ఈ ‘వ్యూహం’ సినిమా షూటింగ్ కొనసాగుతోంది.
రెండు భాగాలుగా చిత్రీకరించే ఈ సినిమాను అసెంబ్లీ ఎన్నికలకు ముందే విడుదల చేయనున్నట్లు రాంగోపాల్ వర్మ చెబుతున్నారు. అయితే పవన్ కల్యాణ్, చంద్రబాబులు పిలిచి అడిగినా దర్శకత్వం వహించనంటూ తెగేసి చెబుతున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జరిగిన పరిణామాలు, ఎవరి వ్యూహాలు ఎలా ఉంటాయోన్న అంశాలు ఈ సినిమాలు ఉంటాయని పేర్కొన్నారు. అలాగే మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య అంశం కూడా ఈ సినిమాలో ఉంటుందని, వివేకానంద హత్య కేసులో నిందితులను సైతం చూపిస్తానంటున్నారు వర్మ. భారతరెడ్డిని దగ్గర నుంచి నేను చూశానని, వైఎస్ఆర్,జగన్ తో పాటు భారతీ కూడా ఉంటుందని వివరించారు.
ఎవరేమి సినిమాలు చిత్రీకరించినా నాకు అనవసరమని, నా వద్ద ఉన్న అంశాల ఆధారం సినిమా ఉంటుందని అన్నారు. ఏపీలో ఉన్నరాజకీయాలు ఆసక్తికరంగా ఉన్నాయని, తాను తీసే సినిమాలో ఏపీ రాజకీయాలు కూడా ఉంటాయని వెల్లడించారు. నేను జగన్ కు అభిమానిని, కానీ ఎవ్వరిపై కూడా ఎలాంటి ద్వేషం లేదు. ఇచ్చేవాళ్లు ఉంటే హీరోలు పారితోషకం తీసుకోవడం ఎలాంటి తప్పు లేదంటున్నారు వర్మ. ఎవరికి ఎంత ఇవ్వాలన్నది ప్రస్తుత మార్కెట్ ను బట్టి తీసుకుంటారు. నా సినిమా వెనుక దాసి కిరణ్ తప్ప ఇంకెవ్వరు లేరని రాంగోపాల్ శర్మ స్పష్టం చేశారు.