Mon Dec 23 2024 04:18:35 GMT+0000 (Coordinated Universal Time)
భీమ్లానాయక్ కు షాక్.. సినిమాపై పోలీసులకు ఫిర్యాదు
సినిమాలో చిత్రీకరించిన ఒక సన్నివేశం తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ కుమ్మరి కులస్తులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు..
గుంటూరు : పవన్ కల్యాణ్ - రానా దగ్గుబాటి కాంబినేషన్ లో.. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా భీమ్లా నాయక్. ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే భీమ్లా నాయక్ రూ.100 కోట్లు వసూలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. సినిమా హిట్ అయిందని పవన్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో భీమ్లా నాయక్ టీమ్ కు, అభిమానులకు ఊహించని షాక్ తగిలింది.
Also Read : భోళాశంకర్ ఫస్ట్ లుక్ విడుదల
సినిమాలో చిత్రీకరించిన ఒక సన్నివేశం తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ కుమ్మరి కులస్తులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఏపీ కుమ్మరి, శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ ఎం. పురుషోత్తం గుంటూర్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తాము ఎంతో పవిత్రంగా భావించే 'కుమ్మరి చక్రాన్ని' రానా కాలుతో తన్నే సన్నివేశం తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, ఆ సన్నివేశాన్ని వెంటనే సినిమానుంచి తొలగించాలని పురుషోత్తం డిమాండ్ చేశారు. మరి ఈ వివాదంపై చిత్రబృందం ఎలా స్పందిస్తుందో చూడాలి.
Next Story