Mon Dec 23 2024 17:43:13 GMT+0000 (Coordinated Universal Time)
ఖిలాడీ నుంచి మరో సింగిల్.. అట్టా సూడకే అంటూ రవితేజ మార్క్ టీజింగ్ !
తాజాగా ఖిలాడీ నుంచి మరో సింగిల్ ను విడుదల చేశారు మేకర్స్. " అట్టా సూడకే.. మత్తెక్ తాందే ఈడుకే" అంటూ వచ్చిన ఈ లిరికల్ వీడియో
క్రాక్ సినిమాతో మాస్ మహారాజా రవితేజ కెరీర్ మళ్లీ ఊపందుకుంది. చిత్ర పరిశ్రమ క్లిష్టపరిస్థితుల్లో ఉన్న సమయంలో 2021 సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. క్రాక్ సక్సెస్ తో.. కెరీర్ ను నిలబెట్టుకున్న రవితేజ.. ఇప్పుడు ఖిలాడీ గా వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఖిలాడీ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు, టీజర్లు రాగా.. సినిమాపై హైప్ ను పెంచేశాయి. తాజాగా ఖిలాడీ నుంచి మరో సింగిల్ ను విడుదల చేశారు మేకర్స్. " అట్టా సూడకే.. మత్తెక్ తాందే ఈడుకే" అంటూ వచ్చిన ఈ లిరికల్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
Also Read : "రామారావు ఆన్ డ్యూటీ" వాయిదా ! ముందే ఖిలాడి
డిసెంబర్ 31వ తేదీన ఈ పాటను విడుదల చేశారు. ఇందులో రవితేజ మార్క్ టీజింగ్ తో కూడిన స్టెప్పులు కనిపిస్తున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఏ స్టూడియోస్ పతాకంపై ఈ సినిమాను సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మలు సంయుక్తంగా నిర్మిస్తుండగా.. మీనాక్షి చౌదరీ, డింపుల్ హాయతీ రవితేజ సరసన హీరోయిన్ లుగా నటిస్తున్నారు. రవితేజ్ డ్యూయల్ రోల్ లో వస్తున్న ఈ సినిమాకు సౌత్ సినీ ఇండస్ట్రీలో ఉన్న టాప్ ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్, అన్బు-అరివు మాస్టర్స్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.
Also Read : బెజవాడలో బుక్ ఫెస్టివల్.. రేపే ప్రారంభం
కాగా ప్రస్తుతం రవితేజ చేతిలో అరడజను సినిమాలుండగా.. ఖిలాడీ 2022 ఫిబ్రవరిలో, రామారావు ఆన్ డ్యూటీ మార్చిలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ రెండింటితో పాటు మరో రెండు సినిమాల షూటింగ్స్ లో కూడా రవితేజ పాల్గొంటున్నట్లు సమాచారం. వాటి టైటిల్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు. దీనిని బట్టి చూస్తే.. 2022లో మాస్ మహారాజా రవితేజ హవానే కనిపించనుందనమాట.
Next Story