Wed Apr 23 2025 00:29:55 GMT+0000 (Coordinated Universal Time)
లిప్ లాక్స్ పై హర్ట్ అయిన ఫ్యాన్స్.. సారీ చెప్పిన అనుపమ
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు సోదరుడి కొడుకు ఆశిష్ రెడ్డి.. రౌడీ బాయ్స్ సినిమా ద్వారా టాలీవుడ్ హీరోగా పరిచయమవుతున్నాడు.

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు సోదరుడి కొడుకు ఆశిష్ రెడ్డి.. రౌడీ బాయ్స్ సినిమా ద్వారా టాలీవుడ్ హీరోగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ఆశిష్ కు జోడీగా నటించింది. ఇటీవలే సినిమా ట్రైలర్ విడుదలవ్వగా.. మంచి రెస్పాన్స్ వస్తోంది. కానీ ట్రైలర్ లో అను - ఆశిష్ ల మధ్య లిప్ లాక్ ఉండటం ఫ్యాన్స్ కు నచ్చలేదు. పైగా ఈ సినిమాలో దాదాపు 5 లిప్ లాక్ సీన్లు ఉన్నట్లు టాక్ రావడంతో మరింత ఆగ్రహానికి గురయ్యారు.
దీంతో అనుపమపై మీమ్స్ చేస్తూ.. తీవ్రంగా ట్రోల్స్ చేశారు. ఇన్నాళ్లు తమ అభిమాన హీరోయిన్ గా భావించిన అను.. ఇలా చేయడం తమకు ఏమాత్రం నచ్చలేదని విమర్శిస్తున్నారు. "నీకు వ్యక్తిగత ఇమేజ్ లేదా.. రెమ్యునరేషన్ కోసం ఇంతకు దిగజారుతావా.. కొత్త కుర్రాళ్లతో ఇలా నటిస్తావా" అంటూ ఓ ఆట ఆడుకున్నారు. ఈ మీమ్స్ పై అనుపమ - ఆశిష్ లు స్పందించారు. మొదట ట్రోల్స్ చూసి ఇద్దరూ నవ్వుకున్నా.. తర్వాత ఫ్యాన్స్ ఫీలింగ్స్ ను హర్ట్ చేసినందుకు అను సారీ చెప్పింది. ఇకపై ఆశిష్ ను టచ్ చేయనని పేర్కొంది. సినిమాలో లిప్ లాక్స్ ఎందుకున్నాయో.. చూస్తేనే అర్థమవుతుందని అనుపమ తెలిపింది.
News Summary - Anupama and Ashish Reacts on Their Liplock Trolls and Anupama Says sorry to her Fans
Next Story