ఇద్దరి పరిస్థితి అలానే ఉంది
ప్రస్తుతం టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోయిన్స్ కు సడన్గా అదృష్ట లక్ష్మి మొహం చాటేసింది. 'అ ఆ', 'ప్రేమమ్' సినిమాలతో తన కెరీర్ ని స్టార్ట్ చేసిన అనుపమ స్టార్టింగ్ లో సక్సెస్ ను అందుకున్న ఆ తర్వాత ఆమెకు అంతగా ఏమి కలిసిరావడం లేదు. లేటెస్ట్ గా ఆమె చేసిన మూడు సినిమాలు ప్లాప్ అయ్యాయి. 'ఉన్నది ఒకటే జిందగీ', 'కృష్ణార్జున యుద్ధం' తర్వాత రీసెంట్ గా వచ్చిన 'తేజ్ ఐ లవ్ యూ' చిత్రాలు నిరాశపరిచాయి.
'తేజ్ ఐ లవ్ యూ' లో తన పాత్ర మంచి పేరు తెచ్చి పెడుతుందని అనుపమ కనిపించిన వారందరికీ చెప్పుకుంది కానీ ఆమె అంచనాలకి తగ్గట్టు ఈ చిత్రం ఆకట్టుకోలేదు. అనుపమ బాటలోనే మరో హీరోయిన్ మెహ్రీన్ కూడా ఉంది. ప్రస్తుతం ఆమెకు కూడా కలిసి రావడం లేదు. ఆమె కూడా స్టార్టింగ్ లో 'కృష్ణగాడి వీర ప్రేమగాథ', 'మహానుభావుడు' లాంటి హిట్లతో కెరియర్ స్టార్ట్ చేసినప్పటికీ ఆ తర్వాత వచ్చిన 'కేరాఫ్ సూర్య', 'జవాన్' తర్వాత 'పంతం'తో మరో ఫ్లాప్ పడింది.
మీడియం రేంజ్ సినిమాలు చేసి సక్సెస్ అయ్యి స్టార్ హీరోస్ పక్కన స్టార్ హీరోయిన్స్ గా ఛాన్స్ కొట్టేద్దాం అంటే వాళ్లకి కలిసి రావడంలేదు. సినిమాలు ప్లాప్స్ అవుతున్నప్పటికీ ఇద్దరికీ చేతిలో కొన్ని సినిమాలయితే వున్నాయి. అయితే వీరు అర్జెంటుగా ఒక హిట్ పడితేనే కానీ ఒక గాడిలోకి రాలేరు. లేకపోతే చిన్న సినిమాల అవకాశాలు కూడా రావు