అనుపమతో సీనియర్ నటుడి గొడవ
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ మధ్య గొడవ జరిగిందా అంటే అవుననే అంటున్నాయి సినీవర్గాలు. హలో గురు ప్రేమ కోసమే సినిమా సెట్స్ లో అనుపమపై ప్రకాశ్ రాజ్ కొంత ఆవేశంగా వ్యాఖ్యలు చేశారని, ఈ వ్యాఖ్యలతో అనుపమ తీవ్రంగా బాధపడిందని, సెట్స్ లో స్పృహకోల్పోయిందని సమాచారం. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ ప్రచారం సినిమాపై దుష్ప్రభావం చూపుతుందని భావించిన మేకర్స్ వెంటనే రంగంలోకి దిగారు.
ఓ ఫోటో పోస్ట్ చేసిన అనుపమ
ఈ వార్తలపై స్పందించి చిత్ర దర్శకుడు నక్కిన త్రినాథరావు...సీనియర్ నటులు సెట్స్ లో యువనటులకు సలహాలు, సూచనలు ఇవ్వడం మామూలేనని, కానీ, అనుపమ కొంత బాధపడి ఉంటుందని, అదేమీ పెద్ద విషయం కాదని స్పష్టం చేశారు. అనుపమ స్పృహతప్పడానికి ఫుడ్ పాయిజన్ కావడమే కారణమని వివరణ ఇచ్చారు. అయినా, ఈ ప్రచారానికి తెరపడకపోవడంతో, ప్రకాశ్ రాజ్ తో దిగిన ఓ ఫోటోను అనుపమ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అయితే, ఈ ప్రచారానికి ముగింపు పలకాలనే ఉద్దేశ్యంతో చిత్ర బృందమే ఈ ఫోటో పోస్ట్ చేయాల్సిందిగా అనుపమపై ఒత్తిడి తెచ్చారని ప్రచారం జరుగుతోంది.