హీరోలకి ఎంట్రీ లేదా?
అనుష్క ఎప్పుడెప్పుడు కనబడుతుంది అనే ఆశతో చాలామంది అభిమానులే ఉన్నారు. సైజు జీరో దెబ్బకి మాయమైన అనుష్క మల్లి నిశ్శబ్దంగా ప్రేక్షకుల ముందుకూ రాబోతుంది. ఒకప్పుడు కాస్త [more]
అనుష్క ఎప్పుడెప్పుడు కనబడుతుంది అనే ఆశతో చాలామంది అభిమానులే ఉన్నారు. సైజు జీరో దెబ్బకి మాయమైన అనుష్క మల్లి నిశ్శబ్దంగా ప్రేక్షకుల ముందుకూ రాబోతుంది. ఒకప్పుడు కాస్త [more]
అనుష్క ఎప్పుడెప్పుడు కనబడుతుంది అనే ఆశతో చాలామంది అభిమానులే ఉన్నారు. సైజు జీరో దెబ్బకి మాయమైన అనుష్క మల్లి నిశ్శబ్దంగా ప్రేక్షకుల ముందుకూ రాబోతుంది. ఒకప్పుడు కాస్త బొద్దుగా ఉన్నప్పటికీ ..ఫేస్ లో ఉన్న క్యూట్ నెస్ తో అనుష్క స్టార్ హీరోలతో చాన్సు కొట్టేసింది. అనుష్క స్ట్రెక్సర్ కాస్త ఎక్కువ ఉన్నప్పటికీ అనుష్క మాత్రం టాలీవడ్ హీరోలందరి సినిమాల్లో నటించింది. అయితే సైజు జీరో తో బొద్దుగా మారిన అనుష్క మునపటి ముద్దుగుమ్మ కాలేకపోయింది. చాలా ప్రయత్నాలు చేసి బరువు తగ్గించించిన అనుష్క మునుపటి గ్లో మిస్ అయ్యింది. తాజాగా జరిగిన నిశ్శబ్దం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అనుష్క 15 ఇయర్స్ జర్నీ లో చక్కగా ట్రెడిషనల్ గా తయారయింది కానీ.. ఫేస్ లో గ్లో కనబడలేదు.
అయితే నిశ్శబ్దం ఈవెంట్ లోనే అనుష్క 15 ఇయర్స్ జర్నీ ఈవెంట్ కూడా జరగడం దానికి అనుష్క నటించిన సినిమాల దర్శకుల్లో చాలామంది హాజరవడం జరిగింది. రాజమౌళి, పూరి, రాఘవేంద్ర రావు, శ్యాం ప్రసాద్ రెడ్డి, పివిపి ఇలా చాలామంది దర్శనిర్మాతలు హాజరై అనుష్క 15 ఇయర్స్ జర్నీ గురించి గొప్పగా మట్లాడారు. అనుష్క ఇండస్ట్రీ లో అడుగుపెట్టి.. 15 ఏళ్ళు అయినా సందర్భంగా ఈ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేసారు. అయితే ఈ ఈవెంట్ లో అనుష్క తో కలిసి నటించిన హీరోలెవరు హాజరవలేదు. అంటే కేవలం దర్శకనిర్మాతలతోనే అనుష్క సరిపెట్టేసింది కానీ.. హీరోలకు మాత్రం నో ఎంట్రీ బోర్డు పెట్టేసింది. లేదంటే ప్రభాస్, మహేష్, బాలకృష్ణ, చిరు, నాగ్ ఇలా అందరూ ఆనుష్క ఈవెంట్ లో వాలిపోయారు. అనుష్క పిలవలేదు కానీ.. పిలిస్తే ఆ ఈవెంట్ మరింత సందడిగా మారి.. అనుష్క గొప్పదనం మరికాస్త తెలిసేది అంటున్నారు అభిమానులు