Mon Dec 23 2024 14:27:15 GMT+0000 (Coordinated Universal Time)
అనుష్క, ప్రభాస్‌కి ఛాలెంజ్ ఇస్తే.. ప్రభాస్, రామ్ చరణ్‌కి..
టాలీవుడ్ లో ఒక కొత్త ఛాలెంజ్ మొదలైంది. ఇక ఈ ఛాలెంజ్ ని అనుష్క, ప్రభాస్‌కి ఇస్తే.. ప్రభాస్ రామ్ చరణ్ కి కంటిన్యూ చేశాడు.
ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక కొత్త ఛాలెంజ్ మొదలైంది. మనం సోషల్ మీడియాలో ఐస్ బకెట్ ఛాలెంజ్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. అంటూ పలు ఛాలెంజ్స్ చూశాము. ఇప్పుడు ఒక సరికొత్త ఛాలెంజ్ ని హీరోయిన్ అనుష్క (Anushka Shetty) స్టార్ట్ చేసింది. నవీన్ పొలిశెట్టితో తాను నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty) మూవీ రిలీజ్ కి సిద్దమవుతున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.. #MSMPrecipechallenge అంటూ అనుష్క ఒక ఛాలెంజ్ ని మొదలు పెట్టింది. ఈ ఛాలెంజ్ లో ఏం చేయాలంటే.. మీ ఫేవరెట్ ఫుడ్ ఐటెం చెప్పి, దాని రెసిపీని కూడా షేర్ చేయాలి. ఈక్రమంలోనే అనుష్క తన ఫేవరెట్ ఫుడ్ రెసిపీని షేర్ చేసి.. ప్రభాస్ కి ఈ ఛాలెంజ్ ని విసిరింది. అనుష్క ఫేవరెట్ డిష్ ఏంటంటే.. మంగుళూరు చికెన్ క్రరీ, నీర్ దోశ. ఇక అనుష్క ఇచ్చిన ఛాలెంజ్ ని ప్రభాస్ స్వీకరించి తన ఫేవరెట్ డిష్ ని తెలియజేశాడు.
తన ఫేవరెట్ ఫుడ్ ఐటెం ‘రొయ్యల పలువా’ అంటూ దాని రెసిపీని ప్రభాస్ షేర్ చేశాడు. ఇక ఈ ఛాలెంజ్ ని కంటిన్యూ చేస్తూ రామ్ చరణ్ (Ram Charan) ని తన ఫేవరెట్ డిష్ చెప్పంటూ అడిగాడు. మరి చరణ్, ప్రభాస్ ఛాలెంజ్ ని స్వీకరించి తన ఫేవరెట్ రెసిపీని షేర్ చేస్తాడా..? అలాగే ఈ ఛాలెంజ్ ని తాను ఎవరికి ఇస్తాడు..? అనే దానిపై ఆసక్తి నెలకుంది. ఇక ఈ ఛాలెంజ్ వల్ల స్టార్స్ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ ఏంటో అభిమానులకు తెలుస్తున్నాయి.
ఇక ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ మూవీ విషయానికి వస్తే.. కొత్త డైరెక్టర్ పి.మహేష్ బాబు ఈ సినిమాని తెరకెక్కించాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ మూవీలో అనుష్క చెఫ్‌గా, నవీన్ స్టాండప్ కమెడియన్‌గా కనిపించబోతున్నారు. సెప్టెంబర్ 7న తెలుగుతో పాటు కన్నడ, మలయాళ, తమిళ్ భాషల్లో కూడా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.
Next Story