Thu Apr 10 2025 16:36:18 GMT+0000 (Coordinated Universal Time)
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది..
అనుష్క, నవీన్ కలిసి నటించిన న్యూ ఏజ్ మూవీ 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. మరి ఈ మూవీ రివ్యూ ఏంటి..?

యువీ క్రియేషన్స్ బ్యానర్లో కొత్త దర్శకుడు మహేష్ బాబు డైరెక్ట్ చేసిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' (Miss Shetty Mr Polishetty) సినిమాతో దాదాపు మూడేళ్ళ తరువాత అనుష్క (Anushka Shetty) మళ్ళీ స్క్రీన్ పై కనిపించబోతుంది. ఇక 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'జాతిరత్నాలు' వంటి బ్లాక్ బస్టర్స్ తరువాత నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) నటిస్తున్న సినిమా కావడం మూవీ పై మంచి బజే క్రియేట్ అయ్యింది.
ఇక ఇటీవల ఈ మూవీని చూసిన చిరంజీవి.. మొదటి ప్రేక్షకుడిగా తన రివ్యూ అంటూ ఇచ్చిన రెస్పాన్స్ సినిమా పై మరింత ఆసక్తిని కలుగజేసింది. నేడు ఈ చిత్రం ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. దీంతో మూవీ చూసిన ఆడియన్స్ సినిమా పై తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. మరి ఈ మూవీ సక్సెస్ అయ్యి నవీన్ పోలిశెట్టికి హ్యాట్రిక్ హిట్టుని అందించిందా..? లేదా..? అనేది రివ్యూలు చూసి మీరే తెలుసుకోండి.
Next Story