అనుష్క షాకింగ్ రెమ్యూనరేషన్
మన టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ విషయంలో మన హీరోస్ ని మించేటట్టు ఉన్నారు. మన హీరోయిన్స్ కి డిమాండ్ పెరగడంతో రేట్లు పెంచేస్తున్నారు. తను తప్ప వేరే [more]
మన టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ విషయంలో మన హీరోస్ ని మించేటట్టు ఉన్నారు. మన హీరోయిన్స్ కి డిమాండ్ పెరగడంతో రేట్లు పెంచేస్తున్నారు. తను తప్ప వేరే [more]
మన టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ విషయంలో మన హీరోస్ ని మించేటట్టు ఉన్నారు. మన హీరోయిన్స్ కి డిమాండ్ పెరగడంతో రేట్లు పెంచేస్తున్నారు. తను తప్ప వేరే హీరోయిన్ ఎవరూ సూట్ అవ్వరు అనిపిస్తే చాలు ఎంతయినా చార్జ్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న రకుల్ ప్రీత్ సింగ్ మన్మధుడు 2 సినిమాకు ఎక్కువ చార్జ్ చేసిందని వార్తలు వచ్చాయి. నిజానికి ఈమెకు డిమాండ్ తక్కువే అయినప్పటికీ ఆమె అంతలా డిమాండ్ చేసిందంటే ఆశర్యపరిచే విషయమే.
ఇక లేటెస్ట్ గా టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్క మూడు కోట్లకుపైగా చార్జ్ చేసిందట. అవును అనుష్క లేటెస్ట్ గా నటిస్తున్న నిశ్శబ్ధం అనే సినిమా కోసం ఆమె అంత తీసుకుంది అంట. మాధవన్ నటిస్తున్న ఈసినిమాను పీపుల్స్ మీడియా, కోన ఫిలి కార్పొరేషన్ కలిపి నిర్మిస్తున్నారు. ఈ పాత్రకి అనుష్క తప్ప ఎవరూ సూట్ కారు అని ఆమె అంత డిమాండ్ చేసిన తీసుకున్నారు. పైగా అనుష్క కి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. అందుకే ఆమె అంత అడిగిన ఏం ఆలోచించకుండా ఇచ్చేసారు అంట. ఈ చిత్ర షూటింగ్ దాదాపు కంప్లీట్ అయిపోయింది. అమెరికాలోనే ఈచిత్ర షూటింగ్ మొత్తం జరిగింది. ఇక ఈమూవీ సౌత్ లో దాదాపు అన్ని భాషల్లో అలానే హిందీ లో కూడా రిలీజ్ కానుంది.