అనుష్క వాటికే సరిపోతుందేమో?
అనుష్క బాహుబలి విరామం మాములుగా లేదు. బరువు తగ్గే కార్యక్రమం అనుష్క ని బాగా ఇబ్బంది పెట్టింది. రెండేళ్లుగా బయటికి కూడా రాకుండా అనుష్క ఒళ్ళు కరిగించింది. [more]
అనుష్క బాహుబలి విరామం మాములుగా లేదు. బరువు తగ్గే కార్యక్రమం అనుష్క ని బాగా ఇబ్బంది పెట్టింది. రెండేళ్లుగా బయటికి కూడా రాకుండా అనుష్క ఒళ్ళు కరిగించింది. [more]
అనుష్క బాహుబలి విరామం మాములుగా లేదు. బరువు తగ్గే కార్యక్రమం అనుష్క ని బాగా ఇబ్బంది పెట్టింది. రెండేళ్లుగా బయటికి కూడా రాకుండా అనుష్క ఒళ్ళు కరిగించింది. తర్వాతే నిశ్శబ్దం సినిమాతో మళ్ళీ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యింది. భాగమతి, నిశ్శబ్దం అన్ని లేడి ఓరియెంటెడ్ మూవీస్. భాగమతి తర్వాత నిశ్శబ్దం సినిమా చేసినా అనుష్క కరోనా లాక్ డౌన్ వలన సినిమా విడుదల ఆలస్యమవుతూ వచ్చింది లేదంటే అనుష్క నిశ్శబ్దం బాక్సాఫీసు దగ్గర సందడి చేసేది. అయితే ఇప్పుడు అనుష్క నిశ్శబ్దం తర్వాత మరో మూవీ ని ఒకే చేసినట్టుగా సోషల్ మీడియా టాక్.
స్టార్ హీరోల అవకాశాలు రాకో.. లేదంటే అనుష్క కె ఇష్టం లేదో తెలియదు కానీ.. అనుష్క మాత్రం ప్రస్తుతం లేడి ఓరియెంటెడ్ మూవీస్ మీదే ఫోకస్ పెట్టినట్లుగా అనిపిస్తుంది. అందుకే అనుష్క మరో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీకి జై కొట్టినట్లుగా తెలుస్తుంది. అది కూడా తనతో భాగమతి సినిమా చేసిన ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ అనుష్క సినిమా ని నిర్మించడానికి ప్లాన్ చేస్తోంది. రారా కృష్ణయ్య ఫేం పి.మహేశ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తాడని… ఇప్పటికే అనుష్క ఓకె చెప్పడంతో… ప్రీ ప్రొడక్షన్ కూడా మొదలైనట్టుగా టాక్.
- Tags
- Anushka