Mon Dec 23 2024 10:44:57 GMT+0000 (Coordinated Universal Time)
RRR టికెట్ల రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బెనిఫిట్ షోలు షురూ !
RRR కు ఏపీలో కలెక్షన్ల మోత మోగనుందనడంలో సందేహం లేదు. ఇక బెనిఫిట్ షో లకు కూడా సపోర్ట్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఎగ్జిబిటర్లు
అమరావతి : దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో.. భారీ బడ్జెట్ తో, భారీ తారాగణంతో తెరకెక్కిన RRR సినిమా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ మేరకు దర్శకుడు సహా.. తారక్, చెర్రీ, అలియా తదితర నటులు సినిమా ప్రమోషన్స్ లో బిజీ అయ్యారు. తాజాగా RRR నుంచి ఎత్తర జెండా అంటూ ఉత్తేజభరిత పాటను విడుదల చేయగా.. అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని.. అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
కాగా.. నిన్న దర్శకుడు రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ తో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో రాజమౌళి RRR విడుదల సందర్భంగా టికెట్ల రేట్లు, బెనిఫిట్ షో లపై చర్చించారు. అందుకు జగన్ సుముఖత తెలిపారంటూ వార్తలొచ్చాయి. తాజాగా జగన్ సర్కార్ RRR సినిమా టికెట్ ధరలను 100 రూపాయల వరకూ పెంచుకునేందుకు థియేటర్లకు అనుమతులిస్తూ ప్రకటన చేసింది. దీంతో RRR కు ఏపీలో కలెక్షన్ల మోత మోగనుందనడంలో సందేహం లేదు. ఇక బెనిఫిట్ షో లకు కూడా సపోర్ట్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఎగ్జిబిటర్లు పెద్ద సినిమాలను రోజుకు ఐదు షోలు ప్రదర్శించవచ్చని ఏపీ మంత్రి పేర్ని నాని తెలిపారు. పెద్ద సినిమా, చిన్న సినిమా ఒకేరోజు విడుదలైతే ఎగ్జిబిటర్లు కనీసం రోజుకు ఒక్కసారైనా చిన్న సినిమాలను ప్రదర్శించాలని అన్నారు.
Next Story