Sun Dec 22 2024 06:25:51 GMT+0000 (Coordinated Universal Time)
సిరివెన్నెలకు ఏపీ ప్రభుత్వం ఘన నివాళులు
సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రికి ఏపీ ప్రభుత్వం ఘన నివాళులర్పించింది.
సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రికి ఏపీ ప్రభుత్వం ఘన నివాళులర్పించింది. ఏపీ ప్రభుత్వం తరుపున సమాచార శాఖ మంత్రి పేర్ని నాని సిరివెన్నెల సీతారామ శాస్త్రి పార్థీవ దేహానికి నివాళులర్పించారు. తెలుగు సినీ పరిశ్రమ ఒక దిగ్గజ రచయిత కోల్పోయిందని పేర్ని నాని పేర్కొన్నారు. సిరివెన్నెల కుటుంబ సభ్యులను పేర్ని నాని పరామర్శించారు.
ఫిలింఛాంబర్ లో.....
ఫిలింఛాబర్ లో ఉన్న సిరివెన్నెల సీతారామ శాస్త్రి పార్థీవదేహానికి సినీ ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. నందమూరి బాలకృష్ణ, అల్లు అరవింద్, రానా, మురళీమోహన్, దర్శకులు విశ్వనాధ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, నటులు కోట శ్రీనివాసరావు, హీరో నానిలు నివాళులర్పించారు. ఈరోజు సిరివెన్నెల సీతారామ శాస్త్రి పార్థీవ దేహానికి అంత్యక్రియలు జరగనున్నాయి.
Next Story