Mon Dec 23 2024 08:49:15 GMT+0000 (Coordinated Universal Time)
RGV : వ్యూహం సినిమా చుట్టూ నిరసనలు.. థియేటర్ ఓనర్స్‌కి చెమటలు..
ఆర్జీవీ వ్యూహం సినిమా చుట్టూ వివాదాలు, నిరసనలు. టెన్షన్ తో థియేటర్ ఓనర్స్‌కి చెమటలు.
RGV Vyooham : టాలీవుడ్ లో ఎప్పుడూ వివాదాస్పద సినిమాలు చేస్తూ సంచలనం సృష్టించే రామ్ గోపాల్ వర్మ.. ఈసారి ఏపీ పాలిటిక్స్ ఆధారంగా వ్యూహం, శపథం అనే రెండు సినిమాలను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లైఫ్ లో జరిగిన కొన్ని యదార్ధ సంఘటనలు ఆదరంగా తెరకెక్కుతున్నాయి. ఈక్రమంలోనే జగన్ పాత్రతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులకు సంబంధించిన పాత్రలను చూపించబోతున్నారు.
ఈ మూవీ నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్, పోస్టర్స్ చూసిన తరువాత.. టీడీపీ నాయకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా రిలీజ్ ని అడ్డుకోవాలంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్రతిష్టని దెబ్బతీసేలా ఆర్జీవీ సినిమా తెరకెక్కించారంటూ.. టీడీపీ నాయకులు కోర్టులో కేసులు కూడా వేశారు. ఇటీవల ఆర్జీవీ ఆఫీస్ ముందు దిష్టిబొమ్మని దగ్ధం చేసి నిరసన తెలిపారు.
ఇక అమరావతి ఉద్యమం నేత కోలికపూడి శ్రీనివాసరావు వంటి వారు.. టీవీ ఛానల్స్ లో ఆర్జీవీ తల నరికి తీసుకొచ్చినవారికి కోటి రూపాయల బహుమతి ఇస్తానంటూ ప్రకటించారు. ఇక ఈ వ్యాఖ్యలు చేసిన కోలికపూడి పై ఆర్జీవీ డిజిపికి పిర్యాదు చేశారు. అలాగే తన ఆఫీస్ ముందు దిష్టిబొమ్మని దగ్ధం చేసిన వారి పై కూడా కేసు నమోదు. అయినాసరి టీడీపీ నాయకులు సినిమా రిలీజ్ పై ఆగ్రహం గానే ఉన్నారు.
ఈ నిరసనలు, గొడవలు చూసి ఏపీ థియేటర్ ఓనర్స్ కి టెన్షన్ తో చెమటలు పట్టుకున్నాయి. ఇప్పుడు ఈ చిత్రాన్ని థియేటర్స్ లో రిలీజ్ చేస్తే.. థియేటర్ వద్ద ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయో అని భయపడుతున్నారు. కాగా ఈ చిత్రం ఈ శుక్రవారం డిసెంబర్ 29న రిలీజ్ కాబోతుంది. మరి సినిమా రిలీజ్ ఎలా అవుతుందో చూడాలి.
Next Story