అరవింద హిట్ తో ఎన్టీఆర్ హ్యాపీయేనా..?
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత వీరరాఘవ సినిమా గురువారం విడుదలై సక్సెస్ ఫుల్ గా థియేటర్స్ లో కలెక్షన్స్ సునామి సృష్టిస్తుంది. ఎన్టీఆర్ వన్ మ్యాన్ షోలా అరవింద సమేత ఉందని అంటున్నారు. ఎన్టీఆర్ వీరరాఘవరెడ్డి పాత్రలో జీవించాడని... ప్రేమికుడిగా, కొడుకుగా, ఫ్యాక్షన్ లీడర్ గా, మనవడిగా అన్ని పాత్రల్లో ఎన్టీఆర్ జీవించాడంటున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపెట్టాడని సిక్స్ ప్యాక్ తో ఇరగదీసాడంటున్నారు. త్రివిక్రమ్ తో కలిసి సాలిడ్ హిట్ అందుకున్నాడంటున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కాదు... సాధారణ ప్రేక్షకుడు కూడా అరవింద సమేత లో ఎన్టీఆర్ నటనను పొగుడుతున్నారు. అయితే ఎన్టీఆర్ అరవింద హిట్ తో ఆనందంగా ఉన్నాడా? అంటే ఏదో అనుమానం మాత్రం కలగకుండా మానదు. ఎందుకంటే ఇండస్ట్రీ హిట్ అందుకోవాలని ఎన్టీఆర్ ఎప్పటి నుండో తహతహ లాడుతున్నాడు. కొరటాల శివ తో కలిసి జనతా గ్యారేజ్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాలనుకుంటే.. క్రిటిక్స్ నుండి వ్యతిరేకత వచ్చినా.. కలెక్షన్స్ పరంగా కుమ్మేసింది.
సినిమా బాగుంది అంటున్నా...
ఇక జై లవ కుశ సినిమాతో అయినా హిట్ కొట్టాలనుకుంటే... ఆ సినిమాలో జై పార్ట్ తప్ప లవ, కుశ పార్ట్స్ తో జైలవకుశ సినిమాకి యావరేజ్ పడింది. జై కేరెక్టర్ లో నటనతో పీక్స్ కి తీసుకెళ్లిన ఎన్టీఆర్ లవ, కుశ కేరెక్టర్ తో తేలిపోవడంతో ఆ సినిమాతోనూ ఎన్టీఆర్ అసంతృప్తిగానే ఉన్నాడు. ఇక పన్నెండేళ్ల కల అంటూ త్రివిక్రమ్ తో సినిమా చేసి అత్తారింటికి దారేది లాంటి ఇండస్ట్రీ హిట్ అందుకోవాలని కలలు కన్నాడు. కానీ ఈ సినిమా టాక్ చూసిన ఎన్టీఆర్ కల కలగానే ఉండిపోయింది. అరవింద సమేత ని క్రిటిక్స్ ఆకాశానికెత్తేసినప్పటికీ ఒక వర్గం ప్రేక్షకులు మాత్రం అరవింద కి పాజిటివ్ టాక్ ఇవ్వలేకపోతున్నారు. హా పర్వాలేదులే అని అంటున్నారు. మరి ఈ సినిమా విజయంతో ఎన్టీఆర్ తృప్తి చెందాడంటారా.. లేదంటే అసంతృప్తిగా ఉన్నాడా అనేది మాత్రం కాస్త అనుమానమే. ఇక ఎన్టీఆర్ ఇప్పుడు రాజమౌళి మల్టీస్టారర్ తో అయినా గొప్ప హిట్ అందుకుని ఒక రేంజ్ కి ఎదగాలని ఆశపడుతున్నాడట.