ఆ రూమర్ కి భయపడిన అరవింద బృందం..!
ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ లో తండ్రి కొడుకులుగా నటించిన ఆంధ్రావాలా సినిమా ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యింది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా నటించారు. ఇక ఆ సినిమా ఫ్లాప్ తో ఎన్టీఆర్ తర్వాత మళ్లీ తండ్రి కొడుకులుగా నటించలేదు. అయితే తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అరవింద సమేత వీరరాఘవ సినిమాలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా డ్యూయెల్ రోల్ చేయబోతున్నట్లుగా గత రెండు రోజులుగా ఫిలింనగర్ తో పాటుగా సోషల్ మీడియాలోనూ వినబడుతున్న న్యూస్.
డ్యుయెల్ రోల్ అని ప్రచారం జరగడంతో...
ఆమధ్యన నాగబాబు ఎన్టీఆర్ తండ్రిగా రాయలసీమలోని ఒక ఊరికి గ్రామపెద్దగా ఉంటూ.. గ్రామస్తుల కోసం భార్యాపిల్లల్ని వదిలేసి.. ప్రజలే కావాలంటూ వారి బాగోగులు చూస్తూ.. అదే గ్రామంలోని మోతుబరి జగపతి బాబుతో పోటీ పడడం.. ప్రత్యర్థుల చేతుల్లో నాగబాబు చనిపోతే తండ్రి బాధ్యతలను ఎన్టీఆర్ తీసుకుని ఎన్నికల్లో పోటీ చేస్తాడనే ప్రచారం జరిగినా అరవింద బృందం నుండి ఎలాంటి స్పందన లేదు. కానీ ఇప్పుడు తండ్రీకొడుకుల గెటప్స్ విషయంలో చాలా త్వరగా స్ప్రెడ్ అయిన ఈ న్యూస్ పై అరవింద సమేత బృందం క్లారిటీ ఇచ్చింది.
వెంటనే స్పందించిన చిత్ర బృందం
అరవింద సమేత వీర రాఘవ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేయడం లేదని ప్రకటించింది. మరి ఒక పుకారుకి అరవింద బృందం వెంటనే స్పందించడం అనేది ఆహ్వానించదగిన విషయమే. కానీ ఈ చిన్న విషయానికే ఇంత తొందరగా రియాక్ట్ కావడమనేది మాత్రం కాస్త ఆశ్చర్యం కలిగించే అంశం. మరి ఆంధ్రావాలాలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ చేస్తే ఆ సినిమా అట్టర్ ప్లాప్ అవడంతోనే అరవింద బృందం తమ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడనే రూమర్ వలన సినిమాపై ఎక్కడ నెగటివ్ థాట్స్ వస్తాయో అని భయపడి వెంటనే స్పందించిందనేది మాత్రం వాస్తవం అంటున్నారు.