అరవింద పై ఈ న్యూస్ రూమరా... నిజమా?
త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబోలో హారిక హాసిని క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న అరవింద సమేత షూటింగ్ ఎండ్ కొచ్చేసింది. ఒక్క పాటలో కొద్దిగా బ్యాలెన్స్ ఉన్న షూటింగ్ రేపో ఎల్లుండో పేకప్ చెప్పేస్తారు. ఇక ఎలాగూ షూటింగ్ కంప్లీట్ అవడం... అరవింద సమేత ప్రి రిలీజ్ ఈవెంట్ కూడా మంగళవారం అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. ఇక ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేసి.. సినిమాకి మరింత క్రేజ్ తీసుకొచ్చే పనిలో చిత్ర బృందం ఉంది. ఇక ఎలాగూ సినిమా విడుదలకు ఆసలే సమయం లేదు. కేవలం పది రోజుల టైం మాత్రమే మిగిలి ఉంది. ఈలోపు త్రివిక్రమ్ అరవింద పోస్ట్ ప్రొడక్షన్ పనులను కంప్లీట్ చేస్తూనే ప్రమోషన్స్ నిర్వహించాలి. ఎలాగూ త్రివిక్రమ్ సోలోగా కానీ చిత్ర బృందం తో కానీ కలిసి ఇంటర్వ్యూ ఇచ్చే రకం కాదు. ఇక ఎన్టీఆర్, పూజ హెగ్డే, సినిమాలోని కీలక పాత్రలు ప్రమోషన్ పనులు చూసుకుంటుంటే త్రివిక్రమ్ మాత్రం అరవిందుడి పోస్ట్ ప్రొడక్షన్ మీద ఫోకస్ పెడతాడట.
డ్యూయల్ రోలా..?
తాజాగా అరవింద సమేత వీర రాఘవ మీద ఒక రూమర్ లాంటి న్యూస్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యింది. అదేమిటంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేయబోతున్నాడని... ఇంతకుముందు ఎన్టీఆర్ తండ్రిగా నాగబాబు నటిస్తున్నాడనే టాక్ ఉంది. ఇక టీజర్ లో కూడా అదే అర్ధమయ్యింది. కానీ తాజాగా బయటికొచ్చిన న్యూస్ ప్రకారం ఎన్టీఆర్ డ్యుయల్ రోల్ చేస్తున్నాడట. ఇటు తండ్రి పాత్రలోనూ, అటు కొడుకు పాత్రలోనూ ఎన్టీఆర్ నటిస్తున్నట్లు ఆ న్యూస్ సారాంశం. అలాగే ఇద్దరు హీరోయిన్స్ గా పూజ హెగ్డే, ఇషా రెబ్బలు నటిస్తున్నట్లుగా మొదటినుండి చెబుతున్నారు. తాజాగా మరో హీరోయిన్ మేఘశ్రీ కూడా ఈ సినిమా లో నటిస్తుందంటున్నారు.
కేవలం రూమరేనా..?
ఇక పూజ హెగ్డే అరవింద పాత్ర లో టైటిల్ రోల్ పోషిస్తుంటే.. ఇషా రెబ్బ ఈ సినిమా లో తండ్రి పాత్ర చేస్తున్న ఎన్టీఆర్ సరసన నటించిందని సమాచారం. అయితే ఈ న్యూస్ బయటికి రాకుండా చిత్ర బృందం ఇన్నాళ్లు కాపాడిందని.. సినిమాలో సర్ప్రైజ్ గా ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ రివీల్ చేద్దామని అనుకున్నట్లుగా చెబుతున్నారు. ఇక తండ్రి పాత్రలో నటించిన ఎన్టీఆర్ ఊరి కోసం భార్యని, పిల్లాడిని వదిలేసి.. ప్రజలే తనకు ముఖ్యమంటూ వెళ్లిపోవడంతో.. ఆ తర్వాత తండ్రి శత్రువుల చేతిలో చనిపోతే కొడుకు ఎన్టీఆర్ తండ్రి స్థానం కోసం ఎన్నికల్లో పాల్గొనడం.. ఇలా అరవింద సమేత కథ ఉంటుందంటూ సోషల్ మీడియా సాక్షిగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇదంతా రూమరా.. లేదంటే నిజమా అనేది మాత్రం మరో పది రోజుల్లో తెలుస్తుంది.