మహర్షి రిజల్ట్ తో ముందుకొస్తాడా..?
నిఖిల్ అర్జున్ సురవరం సినిమా విషయంలో ఎంతగా కాన్ఫిడెంట్ గా కనబడుతున్నప్పటికీ ఆ సినిమా విడుదల విషయంలో టోటల్ కన్ఫ్యూషన్ లో ఉంటున్నాడు. ఎప్పటికపుడు సినిమా విడుదల [more]
నిఖిల్ అర్జున్ సురవరం సినిమా విషయంలో ఎంతగా కాన్ఫిడెంట్ గా కనబడుతున్నప్పటికీ ఆ సినిమా విడుదల విషయంలో టోటల్ కన్ఫ్యూషన్ లో ఉంటున్నాడు. ఎప్పటికపుడు సినిమా విడుదల [more]
నిఖిల్ అర్జున్ సురవరం సినిమా విషయంలో ఎంతగా కాన్ఫిడెంట్ గా కనబడుతున్నప్పటికీ ఆ సినిమా విడుదల విషయంలో టోటల్ కన్ఫ్యూషన్ లో ఉంటున్నాడు. ఎప్పటికపుడు సినిమా విడుదల అంటూ డేట్ ప్రకటించడం.. అనుకోకుండా పరిస్థితులు అనుకూలించడం లేదంటూ వెనక్కి వెళ్లిపోవడంతో.. ఆ సినిమా మీద అంచనాలు పడిపోతున్నాయి. మళ్లీ తన ప్రమోషన్స్ తో సినిమా మీద అంచనాలు పెంచుతున్నాడు. ఏప్రిల్ నెలాఖరున విడుదల చేద్దామంటే అవెంజర్స్ ఎండ్ గేమ్ కి భయపడి మే 17కి వెళితే మహర్షి సునామీలో కొట్టుకుపోతానని మళ్లీ వెనక్కి తగ్గినట్లే కనబడ్డాడు నిఖిల్.
మంచి సమయం మించితే దొరకదు
అందుకే ప్రమోషన్స్ తగ్గించాడు. తాజాగా మహర్షికి ఓ అన్నంత పాజిటివ్ టాక్ పడకుండా మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. మహర్షితో పెట్టుకుని వారం తీరగకుండానే అర్జున్ సురవరం బాక్సాఫీసు వద్దకు వస్తే ఎలా అన్నారు. అందుకే సీత, కల్కి లాంటి సినిమాలు రెండు వారాల గ్యాప్ తో తమ సినిమా రిలీజ్ డేట్స్ ని ఎనౌన్స్ చేశాయి. మరి తాజాగా మహర్షి టాక్ తో మే 17 న నిఖిల్ అర్జున్ సురవరాన్ని దింపితే బాగానే ఉంటుంది. ఎందుకంటే ఈ టాక్ తో మహర్షి వారానికి దుకాణం సర్దేయ్యడం ఖాయంగానే కనబడుతుంది. మహేష్ కి భయపడాల్సింది లేదని.. మహర్షి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోలేదు కాబట్టి తమ సినిమాలను దైర్యంగా విడుదల చేసుకోవచ్చని ఇప్పటికే మీడియం రేంజ్ నిర్మాతలు ఆలోచిస్తున్నారు. మరి నిఖిల్ కి ఇంతకన్నా మంచి ఛాన్స్ రాదు. అర్జున్ సురవరాన్ని మంచి ప్రమోషన్స్ తో ఈ మే 17న విడుదల చెయ్యడానికి. చూద్దాం నిఖిల్ ఆలోచన ఎలా ఉందో.