Sat Dec 21 2024 14:58:39 GMT+0000 (Coordinated Universal Time)
అరవింద్ స్వామి ఆ సీనియర్ నటుడు కొడుకు అని మీకు తెలుసా..?
తమిళ నటుడు అరవింద్ స్వామి ఆ సీనియర్ నటుడు కొడుకు అని మీలో ఎంతమందికి తెలుసా..?
తమిళ నటుడు అరవింద్ స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రోజా, బొంబాయి వంటి సినిమాలతో ఇండియా వైడ్ ఎంతో ఫేమ్ ని సంపాదించుకున్నాడు. అయితే మధ్యలో కొన్నాళ్ళు సినీ పరిశ్రమకు దూరమయ్యి తమ ఫ్యామిలీ బిజినెస్ ని డెవలప్ చేసుకున్నాడు. అరవింద్ స్వామి తండ్రి వెంకటరామ దొరై స్వామి అని అందరికి తెలిసిన విషయమే. ఈయనకు తమిళనాడులో పలు హాస్పిటల్స్ ఉన్నాయి. వీటితో పాటు అరవింద్ కొత్త బిజినెస్ లు కూడా స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యాడు.
అయితే అందరికి తెలిసినట్టు వెంకటరామ దొరై స్వామి.. అరవింద్ స్వామి సొంత తండ్రి కాదు. అరవింద్ స్వామి సొంత తండ్రి కూడా సినీ పరిశ్రమకు చెందిన వాడే. తెలుగు, తమిళంలో పలు సినిమాల్లో నటించిన ఢిల్లీ కుమార్.. అరవింద్ స్వామి అసలు తండ్రి. ఈయనకు ఇద్దరు పిల్లలు. వారిలో ఒకడైన అరవింద్ స్వామిని ఊహ తెలియని వయసులోనే.. ఢిల్లీ కుమార్ తన చెల్లెలు వసంత స్వామికి దత్తత ఇచ్చేశారు. అప్పటి నుండి అరవింద్ స్వామి వాళ్ళ అబ్బాయి లాగానే పెరిగాడు.
ఢిల్లీ కుమారే తన సొంత తండ్రి అని అరవింద్ స్వామికి తెలుసు. కానీ ఆ బంధాన్ని ఎక్కువ పెంచుకోలేదట. ఫ్యామిలీ ఫంక్షన్స్ జరిగినప్పుడు ఇద్దరు కలవడం తప్ప, ప్రత్యేకంగా ఎప్పుడు కలుసుకోరట. అలాగే ఇద్దరు కూడా ఒకరి గురించి ఒకరు బయట ఇంటర్వ్యూలో ఎక్కడా పెద్దగా మాట్లాడుకోరు కూడా. గతంలో అరవింద్ స్వామి ఇండస్ట్రీకి పరిచయం అయ్యినప్పుడు ఢిల్లీ కుమార్ తన సొంత తండ్రి అని చెప్పాడు.
ఆ తరువాత మళ్ళీ ఇప్పటి వరకు ఎక్కడా ఆ విషయాన్ని మాట్లాడలేదు. ఇక ఢిల్లీ కుమార్ కూడా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మాట్లాడడం తప్ప.. బయట ఇప్పటివరకు ఎక్కడా మాట్లాడిన సందర్భాలు లేవు. మరి మీలో ఎంతమందికి తెలుసు.. అరవింద్ స్వామి ఢిల్లీ కుమార్ తనయుడు అని.
Next Story