అరవింద లెక్కలు చూస్తుంటే నమ్మాలనిపిస్తుంది!!
ఎన్టీఆర్ - త్రివిక్రమ్ అరవింద సమేత యావరేజ్ టాక్ తోనే అదరగొట్టే కలెక్షన్స్ సాధించింది. మొదట్లో సినిమా విషయంలో కొద్దిగా టాక్ తేడా వచ్చింది. సినిమాలో త్రివిక్రమ్ డైలాగ్స్ లేవని, కామెడీ లేదని.. సినిమా మొత్తం ఎన్టీఆర్ లెక్చర్ వినాల్సి వచ్చిందని.. ఎన్టీఆర్ సినిమా మొత్తం సీరియస్ గానే కనబడ్డాడని... అసలు ఎన్టీఆర్ ని ఆలా చూడలేకపోయామని, సినిమాలో రాయలసీమ భాష మరీ ఎక్కువైందని... కొన్ని డైలాగ్స్ పెద్దగా ఎవరికీ అర్ధమే కాలేదని అన్నారు. కానీ క్రమేణా సినిమా కలెక్షన్స్ ఊపందుకున్నాయి. ఇక అరవింద సామెత హిట్ అంటూ నిర్మతలు ఫిగర్స్ విడుదల చెయ్యడం చాలామందికి కామెడిగా అనిపించినా కొందరు సినిమా హిట్ అనేసరికి అది కాస్త... లైట్ తీసుకున్నారు.
ఎనిమిది రోజుల్లోనే.....
ఇక తాజాగా అరవింద సమేత ఎనిమిది రోజుల్లోనే త్రివిక్రమ్ కెరియర్లోనూ .. ఎన్టీఆర్ కెరియర్లోను అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా నిలిచిందని... మొదటి నాలుగు రోజుల్లో అరవింద సమేత 111.80 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి, రంగస్థలం, భరత్ అనే నేను తొలి వీకెండ్ వసూళ్ల రికార్డులను అధిగమించిందని అన్నారు. ఇక సినిమా విడుదలైన ఎనిమిదిరోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 135 కోట్ల వసూళ్లను రాబట్టిందని... గతంలో ఎన్టీఆర్ - బాబీ కాంబోలో వచ్చిన జై లవ కుశ లాంగ్ రన్నింగ్ లో 131 కోట్లను వసూలు చేస్తే.... ఎన్టీఆర్ - కొరటాల కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ కూడా లాంగ్ రన్నింగ్ లో 134 కోట్ల వరకూ రాబడితే ఇప్పుడు అరవింద సమేత కేవలం ఎనిమిది రోజుల్లోనే 135 కోట్లను వసూలు చేసి రికార్డును సృష్టించింది.
కలెక్షన్స్ నమ్మాలి మరి......
మరి సినిమా టాక్ బట్టి చూస్తే చాలామంది ఆ ఫిగర్ ఒప్పుకోకపోయినా.... కలెక్షన్స్ చూస్తుంటే మాత్రం నమ్మాలనిపిస్తుంది. మరి రెండో వారంలో కూడా అరవింద వసూళ్లు బాగానే వుండేట్లుగా కనబడుతున్నాయి. ఎందుకంటే రామ్ హలో గురు ప్రేమకోసమే, విశాల్ పందెం కోడి 2 కి యావరేజ్ టాక్ రావడం, అరవింద కలెక్షన్స్ కి కలిసొచ్చే అంశంలా కనబడుతుంది. చూద్దాం.... ఎన్టీఆర్ స్టామినా అరవింద సమేత క్లోజింగ్ కలెక్షన్స్ ద్వారా తెలిసిపోతుంది.
-