Mon Dec 23 2024 06:16:49 GMT+0000 (Coordinated Universal Time)
అక్షయ్ కాంట్రవర్సీ.. క్షమాపణ చెబుతాడా?
నార్త్ అమెరికా టూర్ ప్రమోషన్ లో భాగంగా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ షూ వేసుకుని గ్లోబ్ పై నడిచారు. ఇది వివాదంగా మారింది
నార్త్ అమెరికా టూర్ ప్రమోషన్ లో భాగంగా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ షూ వేసుకుని గ్లోబ్ పై నడిచారు. ఇది వివాదంగా మారింది. భారతదేశపు గ్లోబ్ పైన షూ వేసుకుని నడుస్తూ షూట్ తీశారు. ఇది నెట్టింట్ వైరల్ గా మారింది. వెంటనే అక్షయ కుమార్ భారతీయులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అక్షయ్ కుమార్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
యాడ్ ప్రమోషన్ లో...
"ఉత్తర అమెరికాలో ప్రజలకు వంద శాతం వినోదాన్ని పంచేందుకు ది ఎంటర్టైనర్స్ సిద్ధంగా ఉంది. మీరంతా కూడా రెడీ కండి. మార్చిలో మేము మీ ముందుకు వస్తున్నాం" అంటూ అక్షయ్ కుమార్ ట్వీట్ చేయడంతో పాటు ప్రమోషనల్ వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో అక్షయ్ కుమార్ తో పాటు దిశ పటాని, నోరా ఫతేహి, మౌనీరాయ్ వంటి వారు ఉన్నారు. వీరంతా షూ వేసుకుని గ్లోబ్ పై నడవటం కాంట్రవర్సీగా మారింది. మరి అక్షయ్ క్షమాపణలు చెప్పి ఆ వీడియోను తొలగిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
Next Story