శ్రీముఖి తో తనకెలాంటి గొడవ లేదంటున్న యాంకర్?
శ్రీముఖి తో రాహుల్ సిప్లిగంజ్ కి బిగ్ బాస్ హౌస్ లో విభేదాలు రావడం, బయటికొచ్చాక ఆ విభేదాలు కొనసాగినా…. నిన్నగాక మొన్న ప్యాచప్ చెప్పుకుని కలిసిపోయారు. [more]
శ్రీముఖి తో రాహుల్ సిప్లిగంజ్ కి బిగ్ బాస్ హౌస్ లో విభేదాలు రావడం, బయటికొచ్చాక ఆ విభేదాలు కొనసాగినా…. నిన్నగాక మొన్న ప్యాచప్ చెప్పుకుని కలిసిపోయారు. [more]
శ్రీముఖి తో రాహుల్ సిప్లిగంజ్ కి బిగ్ బాస్ హౌస్ లో విభేదాలు రావడం, బయటికొచ్చాక ఆ విభేదాలు కొనసాగినా…. నిన్నగాక మొన్న ప్యాచప్ చెప్పుకుని కలిసిపోయారు. ఇక శ్రీముఖి బిగ్ బాస్ కి వెళ్ళకముందు ఈటివి ప్లస్ లో పటాస్ షో నుండి బయటికొచ్చెయ్యడం, తర్వాత యాంకర్ రవి తో శ్రీముఖి కి గొడవలయ్యాయి కాబట్టే శ్రీముఖి పటాస్ షో ని వదిలేసింది అనే టాక్ నడిచింది. ఈటివి ప్లస్ లో ఓ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్న పటాస్ షో శ్రీముఖి ఎగ్జిట్ తో రేటింగ్ పడిపోయిందని.. రవి కూడా పటాస్ షోని ఎత్తలేక చేతులెత్తేశాడని అన్నారు. ఇక శ్రీముఖి బిగ్ బాస్ హౌస్ లో సాడ్ లవ్ స్టోరీ చెప్పడం అది యాంకర్ రవికి కనెక్ట్ చేసి న్యూస్ లు రావడం అబ్బో చాలానే జరిగింది.
ఇక రవి తో యాంకరింగ్ చేస్తావా శ్రీముఖి అంటే.. మా నాన్న చెయ్యమంటే చేస్తా అని చెప్పడంతో.. వీరి మధ్యన ఏదో గట్టిగానే గొడవ జరిగింది అని అనుకున్నారు. అయితే ఈ విషయమై రవి గాని, శ్రీముఖి గాని స్పందించలేదు.ఇక వారిమధ్యన గొడవలు అని జనాలు ఫిక్స్ అయ్యారు. తాజాగా యాంకర్ రవి… శ్రీముఖి కి నాకు ఎలాంటి గొడవలు లేవని, మంచి ఆఫర్ రావడంతో శ్రీముఖి పటాస్ షో ని వదిలేసిందిగాని, మంచి ఆఫర్ వస్తే ఎవరైనా అలానే చేస్తారని, ఇక నాకు మంచి అవకాశాలు రావడంతో నేను పటాస్ ని వదిలేసానని, అంతేకాని శ్రీముఖితో నాకెలాంటి గొడవలు లేవని, శ్రీముఖి నాకెప్పుడూ ఫ్రెండ్ అని, ఇక యాంకరింగ్ లో శ్రీముఖి ది ఓ డిఫెరెంట్ స్టయిల్ అని.. తానొక పంచ్ వేస్తె.. దానికి శ్రీముఖి పది పంచ్ లు వెయ్యగల సత్తా కలిగిన అమ్మాయని చెప్పుకొచ్చాడు. నాకు, శ్రీముఖికి గొడవలు జరిగాయని బయట ప్రచారం జరుగుతుందని, కానీ మేం ఏం లేదని చెప్పినా రాసుకునే వాళ్ళు రాసుకుంటారని, ఇక మేము క్లారిటీ ఇచ్చినా వేస్ట్ అని అందుకే నేను గాని శ్రీముఖి గాని ఈ విషయంలో స్పందించలేదని చెప్పుకొచ్చాడు