Mon Dec 23 2024 03:14:16 GMT+0000 (Coordinated Universal Time)
"అశోకవనంలో అర్జున కల్యాణం" విడుదల వాయిదా
మంచి ఫ్యామిలీ కథగా తెరకెక్కిన "అశోకవనంలో అర్జున కల్యాణం" సినిమాను ఈనెల 4వ తేదీన విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు.
హైదరాబాద్ : విశ్వక్ సేన్.. యూత్ లో, మాస్ ఆడియన్స్ లో మాంచి క్రేజ్ సంపాదించుకున్న నేటితరం యువ హీరో. ఇప్పటి వరకూ యూత్ కి, మాస్ ఆడియన్స్ కి నచ్చే కథలకే ప్రాధాన్యమిస్తూ.. అలాంటి సినిమాలే చేస్తూ వచ్చాడు. కానీ.. ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా దగ్గరవ్వాలన్న ఉద్దేశంతో "అశోకవనంలో అర్జున కల్యాణం" సినిమా చేస్తున్నాడు. విద్యాసాగర్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాను బాపినీడు - సుధీర్ సంయుక్తంగా నిర్మించారు. విశ్వక్ సేన్ సరసన రుక్షర్ థిల్లోన్, రితిక నాయక్ లు కథానాయికలుగా నటించారు. జై క్రిష్ సంగీతాన్ని అందించారు.
మంచి ఫ్యామిలీ కథగా తెరకెక్కిన "అశోకవనంలో అర్జున కల్యాణం" సినిమాను ఈనెల 4వ తేదీన విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ మేరకు పోస్టర్లు కూడా విడుదల చేశారు. కానీ.. సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు తాజాగా మరో ప్రకటన చేశారు. త్వరలోనే మరో తేదీని చెప్తామని ట్వీట్ చేశారు. 4వ తేదీన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా రిలీజ్ అవ్వనుంది. శర్వానంద్ కి మొదట్నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. పైగా ఇది కూడా పెళ్లి చూపులు, పెళ్లి కాన్సెప్ట్ మీద తీసిన సినిమానే కావడంతో.. "అశోకవనంలో అర్జున కల్యాణం" కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
Next Story