హౌస్ లో ఉండాల్సిన పేర్లు చెప్పిన అషు
ప్రతి వారం ఎలిమినేషన్ ప్రాసెస్ ఇంట్రెస్టింగ్ గా జరిగినట్టే ఈ వారం కూడా జరిగింది. ఐదో వారం ఎలిమినేషన్ లో మహేశ్ – శివజ్యోతి – బాబా [more]
ప్రతి వారం ఎలిమినేషన్ ప్రాసెస్ ఇంట్రెస్టింగ్ గా జరిగినట్టే ఈ వారం కూడా జరిగింది. ఐదో వారం ఎలిమినేషన్ లో మహేశ్ – శివజ్యోతి – బాబా [more]
ప్రతి వారం ఎలిమినేషన్ ప్రాసెస్ ఇంట్రెస్టింగ్ గా జరిగినట్టే ఈ వారం కూడా జరిగింది. ఐదో వారం ఎలిమినేషన్ లో మహేశ్ – శివజ్యోతి – బాబా భాస్కర్ – పునర్నవి – రాహుల్ – హిమజ – అషులు ఉన్నారు. శనివారం ఎపిసోడ్ లో మహేష్ అండ్ శివ జ్యోతిలను నాగ్ సేవ్ చేసాడు. ఇక ఆదివారం టెన్షన్ ని కొనసాగిస్తూ నాగ్ హౌస్ మేట్స్ తో గేమ్స్ ఆడిస్తూ మధ్య మధ్యలో సేఫ్ అయిన వారి పేర్లని చెప్పారు నాగ్. ముందుగా బాబా భాస్కర్ ఆ తరువాత పునర్నవి – రాహుల్ ని సేవ్ చేశారు. ఇక మిగిలింది హిమజ అండ్ అషు. వీరిలో ఎవరు ఇంటి నుండి బయటకు వెళ్తారు అనే సస్పెన్స్ నాగ్ బాగానే క్రియేట్ చేసాడు. లాస్ట్ కి అషు ని ఎలిమినేట్ చేయడంతో మన పాతాళ గంగ శివజ్యోతి ఏడుపు మొదలుపెట్టేసింది. ఆమెను ఓదారుస్తూ అషు ఇంటి నుండి బయటకు హ్యాపీ గా వెళ్లిపోయింది.
అషు స్టేజి పై నాగ్ దగ్గరకు వచ్చింది. అక్కడ నాగ్ ఆమెతో ఓ గేమ్ ఆడించాడు. ఆమె ముందు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ల బొమ్మలన్నీ ఉంచి…ఈ హౌస్ లో ఉండాల్సిన వారి ఫొటోస్ ఉంచి అర్హత లేని వారి ఫొటోస్ పగలగొట్టమని నాగార్జున సూచించారు. దాంతో ఆమె శివజ్యోతి – శ్రీముఖి – పునర్నవి – బాబా భాస్కర్ – అలీ రెజా – రవికృష్ణ – వరుణ్ సందేశ్ లు ఇంట్లో ఉండాలని…..మహేష్ – రాహుల్ – వితికా – హిమజ ఇంట్లో ఉండటానికి అర్హులు కాదని వారి ఫొటోస్ పగలకొట్టింది