Mon Dec 23 2024 06:47:48 GMT+0000 (Coordinated Universal Time)
స్టేజ్ మీద ఏడ్చేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయిన పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్విని
దివంగత కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ చివరి చిత్రం 'గంధడ గుడి' గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ అక్టోబర్ 21, శుక్రవారం, బెంగళూరులోని శ్రీ కృష్ణ విహార్ ప్యాలెస్ గ్రౌండ్స్‌లో నిర్వహించారు. గత ఏడాది అక్టోబర్ 29న గుండెపోటుతో పునీత్ రాజ్ కుమార్ కన్నుమూశారు. పునీత్ రాజ్ కుమార్ అతని భార్య, నిర్మాత అశ్విని రాజ్‌కుమార్ హోమ్ బ్యానర్ PRK ప్రొడక్షన్స్ ద్వారా సినిమాను విడుదల చేస్తున్నారు. నగరంలోని ప్యాలెస్ గ్రౌండ్లో జరిగిన పునీత్ పర్వ కార్యక్రమంలో అశ్విని పునీత్ రాజ్‌కుమార్ కన్నీళ్లు పెట్టుకుంటూ వేదికపై నుంచి వెళ్లిపోయారు.
పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నటించిన డాక్యుమెంటరీ చిత్రం గంధడ గుడి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. శాండల్‌వుడ్‌తో పాటు బహుభాషా తారలు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. వేదికపై పునీత్‌తో గడిపిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అదే సమయంలో, అశ్విని పునీత్ రాజ్‌కుమార్, అతని రెండవ కుమార్తె వందిత, డాక్టర్ దొడ్మనే కుటుంబం సహా శివ రాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్, వినయ్ రాజ్‌కుమార్, యువరాజ్‌కుమార్ వేదికపై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు అందరూ కలిసి పునీత్ రాజ్ కుమార్ హిట్ సాంగ్ 'రాజకుమారా' ను ఆలపించారు. ఈ సమయంలో భావోద్వేగానికి గురైన అశ్విని పునీత్ రాజ్‌కుమార్, అభిమానులకు నమస్కరించి, కన్నీళ్లతో వేదికపై నుండి వెళ్లిపోయారు. పాట ముగియగానే అభిమానులు అప్పు, అప్పు అంటూ నినాదాలు చేశారు. ఈ ఈవెంట్ లో అభిమానులు, అప్పు కుటుంబ సభ్యులు ఎంతో ఎమోషనల్ అయ్యారు.
Next Story