Mon Dec 23 2024 17:02:59 GMT+0000 (Coordinated Universal Time)
భర్తతో విడిపోతున్న అసిన్ ? ఇదిగో క్లారిటీ
అమ్మానాన్న ఓ తమిళమ్మాయి, ఘర్షణ, శివమణి, అన్నవరం సినిమాల్లోనూ నటించిన అసిన్.. సూపర్ హిట్ సినిమాలతో..
అసిన్.. ఈ పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులు ముందు గుర్తొచ్చే సినిమా గజిని. అంతకుముందు అమ్మానాన్న ఓ తమిళమ్మాయి, ఘర్షణ, శివమణి, అన్నవరం సినిమాల్లోనూ నటించిన అసిన్.. సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో అనేక సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన అసిన్.. 2016లో ముంబైకి చెందిన వ్యాపారవేత్త రాహుల్ శర్మను పెళ్లాడింది. అప్పటి నుంచి అసిన్ సినిమాలకు దూరంగా ఉంటోంది. వీరి వివాహ బంధానికి గుర్తుగా ఓ పాప కూడా ఉంది. అయితే.. ఇటీవల అసిన్ తన భర్తతో విడిపోతోందంటూ కొన్ని రూమర్స్ వచ్చాయి. అందుకు కారణంలో ఆమె తన సోషల్ మీడియా ఖాతా నుంచి భర్తతో కలిసి ఉన్న కొన్ని ఫొటోలను తొలగించడమే. ఈ రూమర్స్ పై స్పందించిన అసిన్.. విడాకులపై క్లారిటీ ఇచ్చేసింది.
ఈ మేరకు తన ఇన్ స్టా ఖాతాలో ఓ స్టోరీ పెట్టింది. "ప్రస్తుతం మేము మా వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తున్నాము. ఇద్దరం ఒకరికి ఒకరం ఎదురెదురుగా కూర్చొని టిఫిన్ చేస్తూ ఈ వార్తలు చూశాం. ఇవి పూర్తిగా అవాస్తవం, నిరాధార వార్తలు. గతంలో కూడా పెళ్లి సమయంలో మేము బ్రేకప్ చెప్పుకున్నామని వార్తలు రాశారు. ఇలాంటి వార్తలు చూసి 5 నిమిషాల సమయాన్ని వేస్ట్ చేసుకున్నందుకు నిరాశ చెందుతున్నాను. దయచేసి మంచి వార్తలు రాయండి" అని రూమర్స్ స్ప్రెడ్ చేసిన వారికి గట్టిగా కౌంటర్ ఇచ్చింది. దీంతో అసిన్ విడాకుల వార్తలు అబద్ధమని చెప్పకనే చెప్పింది.
Next Story