Tue Dec 24 2024 16:36:00 GMT+0000 (Coordinated Universal Time)
'ది ఫ్యామిలీ మ్యాన్' స్టోరీ చిరంజీవి కోసం రాసిందట..
'ది ఫ్యామిలీ మ్యాన్' స్టోరీని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్.. చిరంజీవి కోసం రాయించాడట. తాజాగా ఇచ్చిన రీసెంట్ ఇంటర్వ్యూలో..
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఒక సూపర్ హిట్ స్టోరీని కాదన్నాడట. బాలీవుడ్ లో తెరకెక్కిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ (The Family Man) వెబ్ సిరీస్ అందరికి గుర్తుకు ఉండే ఉంటుంది. హిందీ నటుడు మనోజ్ బాజ్పాయ్ (Manoj Bajpayee) ఈ సిరీస్ లో మెయిన్ లీడ్ చేశాడు. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ నుంచి ఇప్పటి వరకు రెండు సీజన్స్ ఆడియన్స్ ముందుకు రాగా రెండు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.
ఈ సిరీస్ కి పాన్ ఇండియా వైడ్ అభిమానులు ఏర్పడ్డారు. ఇండియన్ వెబ్ సిరీస్ లో టాప్ ప్లేస్ ఇది నిలబడింది. అయితే ఈ కథని ముందుగా చిరంజీవి కోసం సిద్ధం చేశారట. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్.. చిరంజీవితో చూడాలని ఉంది, జగదేకవీరుడు అతిలోకసుందరి, ఇంద్ర వంటి బ్లాక్ బస్టర్స్ తెరకెక్కించారు. అలాగే చిరుత సినిమాతో రామ్ చరణ్ ని కూడా పరిచయం చేశారు. ఇక చిరంజీవి రీ ఎంట్రీ తరువాత మళ్ళీ సూపర్ హిట్ మూవీని నిర్మించాలని అశ్వినీ దత్ భావించాడట.
ఈక్రమంలోనే బాలీవుడ్ డైరెక్టర్స్ రాజ్-డీకే ని పిలిపించి ఒక కథని సిద్ధం చేయించాడు. ఆ కథే 'ది ఫ్యామిలీ మ్యాన్' స్టోరీ. ఈ సినిమా కథ విన్న చిరంజీవి కొన్ని మార్పులు కూడా కోరాడట. అవి కూడా దర్శకులు చేంజ్ చేశారట. కానీ చిరు మాత్రం ఆ ప్రాజెక్ట్ చేయడానికి ఎందుకో ఆసక్తి చూపలేదు. దీంతో ఆ మూవీ పట్టాలు ఎక్కలేదు. ఇక ఆ కథనే రాజ్-డీకే వెబ్ సిరీస్ గా తీసి సూపర్ హిట్ కొట్టారు.
ఇక ఈ విషయాన్ని అంతా నిర్మాత అశ్వినీ దత్ రీసెంట్ ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఒకవేళ ఆ కథ చిరంజీవి చేసి ఉంటే.. ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ కి వచ్చిన క్రేజ్ కంటే రేటింపు వచ్చేదని తన అభిప్రాయం వెల్లడించాడు. ప్రస్తుతం ఈ ఫ్యామిలీ మ్యాన్ ఆఫర్ విషయం నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది. చిరు అభిమానులు కూడా ఆ కథ తమ హీరో చేసి ఉంటే చాలా బాగుండేదని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Next Story