రాహుల్ కోసం లేట్ గా స్పందిస్తున్నారే
బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ పై పబ్ లో జరిగిన దాడి రాజకీయ రంగు పులుముకుంది. తనపై దాడి చేసిన వారు ఎమ్యెల్యే [more]
బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ పై పబ్ లో జరిగిన దాడి రాజకీయ రంగు పులుముకుంది. తనపై దాడి చేసిన వారు ఎమ్యెల్యే [more]
బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ పై పబ్ లో జరిగిన దాడి రాజకీయ రంగు పులుముకుంది. తనపై దాడి చేసిన వారు ఎమ్యెల్యే కొడుకు, అలాగే ఎమ్యెల్యే బంధువు అంటూ రాహుల్ సిప్లిగంజ్ తన మీద బీర్ బాటిల్ దాడి తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ప్రెస్ మీట్ పెట్టి.. ప్రెస్ వాళ్లతో కాస్త చిరాకుగా మట్లాడ్డం అయ్యింది. రాహుల్ తనకు ఎవరు సపోర్ట్ చేయడం లేదని, రాజకీయనాయకులు ఈ సీన్ లో ఇన్వాల్వ్ అయ్యారని.. కేటీఆర్ కి డైరెక్ట్ మెసేజ్ పెట్టాడు. అయితే ఇంతజరిగినా సినిమా ప్రముఖులెవరు రాహుల్ పై జరిగిన దాడిపై పెదవి విప్పలేదు. రాహుల్ ఒంటరి పోరాటమంటూ ప్రచారం జరగడంతో.. తాజాగా సినిమా ప్రముఖులు రాహుల్ పై దాడి గురించి మాట్లాడుతున్నారు.
తాజాగా ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ అయితే రాహుల్ సిప్లిగంజ్ కి ఎవరు లేరనుకున్నారా.. అంటూ రాహుల్ కి మద్దతు పలకడమే కాదు…. రాహుల్ తో కలిసి ఈరోజు టీఆర్ఎస్ నేత వినయ్ భాస్కర్ ని కలిసి రాహుల్ పై దాడిని వివరించి న్యాయం చెయ్యమని అడగడమే కాదు.. తర్వాత మీడియా తో మట్లాడుతూ..రాహుల్ వెనుక ఎవరూ లేరనుకోవద్దు.. రాహుల్ వెనుక మేమంతా ఉన్నామని.. పబ్ లకి వెళ్లడం తప్పుకాదని, కానీ అక్కడ రాహుల్ పై దాడి చెయ్యడం కరెక్ట్ కాదని, అలా వెళితే కొట్టి చంపేస్తారా అంటూ ఫైర్ అవుతున్నాడు. అదే ప్రెస్ మీట్ ని రాహుల్ ఫ్రెండ్ నోయల్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసి రాహుల్ కి మద్దతు తెలిపాడు. ఇక ప్రకాష్ రాజ్.. పబ్ లో జరిగిన గొడవలో రాహుల్ సిప్లిగంజ్ తప్పులేదని.. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. సో దాడి జరిగిన నాలుగురోజుల కు ఇంతా ఆలస్యంగా ప్రముఖులు స్పందించడం కాస్త విడ్డురమే అయినా.. ఇప్పటికి రాహుల్ వెనక నిలబడ్డారు.