Mon Dec 23 2024 11:23:44 GMT+0000 (Coordinated Universal Time)
Animal : 'యానిమల్' కూడా అదే తప్పు చేస్తుందా..!
యానిమల్ మూవీని ఆడియన్స్ చూస్తారంటారా..? మూవీ టీం తీసుకున్న నిర్ణయం సరైనదేనా..?
Animal : అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ టు బాలీవుడ్ సంచలనం సృష్టించిన దర్శకుడు 'సందీప్ రెడ్డి వంగా'. మొదటి సినిమాగా అర్జున్ రెడ్డి తెరకెక్కించిన ఈ దర్శకుడు.. అదే చిత్రాన్ని బాలీవుడ్ లో కూడా రీమేక్ చేసి హిట్టు కొట్టారు. ఇప్పుడు తన మూడో సినిమాగా 'యానిమల్' చిత్రాన్ని తెరకెక్కించారు. బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్, టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోహీరోయిన్స్ గా నటిస్తున్నారు.
అర్జున్ రెడ్డిని పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన సందీప్ వంగా.. ఈ యానిమల్ మూవీని రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించారు. అండర్ వరల్డ్ డాన్స్ బ్యాక్డ్రాప్ కి ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ ని యాడ్ చేసి యానిమల్ ని ఆడియన్స్ కి పరిచయం చేయబోతున్నారు దర్శకుడు. అండర్ వరల్డ్ మూవీస్ కి ఈ సినిమా ఒక బెంచ్ మార్క్ అవుతుందని సందీప్ వంగా ధీమా వ్యక్తం చేస్తున్నారు.
డిసెంబర్ 1న రిలీజ్ అయ్యేందుకు ఈ సినిమా సిద్దమవుతుంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ దర్శకుడు.. ఈ మూవీ రన్ టైం, అలాగే సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ గురించి తెలియజేశారు. అర్జున్ రెడ్డి మాదిరి ఈ సినిమాకి కూడా 'A' సర్టిఫికెటే వచ్చింది. ఇక రన్ టైం విషయానికి వస్తే అర్జున్ రెడ్డిని మించిపోయి ఉంది. అర్జున్ రెడ్డి మూడు గంటల నిడివితో వస్తే.. యానిమల్ 3 గంటల 21 నిమిషాల 23 సెకండ్స్ నిడివితో వస్తుంది.
ఈ విషయమే ఇప్పుడు సందేహం కలిగిస్తుంది. ఇంత రన్ టైంని ఆడియన్స్ అంగీకరిస్తారా..? లేదా బోర్ ఫీల్ అవుతారా..? ఇటీవల కొన్ని చిత్రాలు ఎక్కువ నిడివితో రిలీజ్ అవ్వడం, ఆ తరువాత ఆడియన్స్ బోర్ ఫీల్ అవుతున్నారని, థియేటర్స్ కి రావడం లేదని.. మళ్ళీ ట్రిమ్ చేసి రన్ టైం తగ్గించడం జరుగుతుంది. దీని వల్ల సినిమా కలెక్షన్స్, ఫలితం పై ఎఫక్ట్ పడుతుంది. మరి యానిమల్ కి కూడా ఇలాంటి సమస్యే ఎదురవుతుందా..? లేదా ఆడియన్స్ నుంచి అంగీకారం అందుకుంటుందా..? అనేది చూడాలి.
Next Story