Thu Dec 19 2024 15:19:27 GMT+0000 (Coordinated Universal Time)
Avantika : మహేష్ సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్.. హాలీవుడ్లో ఇలా..
మహేష్ బాబు సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హాలీవుడ్ యాక్ట్రెస్ గా మారి హాట్ హాట్ అందాలతో షేక్ చేస్తుంది.
Avantika Vandanapu : అవంతిక వందనపు తెలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ చేసింది. మహేష్ బాబు నటించిన 'బ్రహ్మోత్సవం' సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి వేడితెరకు పరిచయం అయ్యింది. ఆ తరువాత ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం, ఆక్సిజన్, అజ్ఞాతవాసి సినిమాల్లో కూడా కనిపించింది. అజ్ఞాతవాసి తరువాత ఈ భామ హాలీవుడ్ చెక్కేసింది. అక్కడ సిరీస్లు సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది.
హాలీవుడ్లో 'మీరా రాయల్ డిటెక్టీవ్' మూవీ, 'డైరీ అఫ్ ఫ్యూచర్ ప్రెసిడెంట్' సిరీస్ లో ముఖ్య పాత్రలో నటించింది. 2021లో 'స్పిన్' అనే సినిమాలో మెయిన్ లీడ్ లో నటించి హాలీవుడ్ ఆడియన్స్ కి బాగా పరిచయమైంది. ఆ తరువాత 'సీనియర్ ఇయర్' అనే సినిమాలో నటించిన అవంతిక.. రీసెంట్ గా 'మీన్ గర్ల్స్' అనే టీన్ కామెడీ సినిమాలో ఒక ప్రధాన పాత్రలో నటించింది. ఈ పాత్రలో తన నటనతో హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఫుల్ వైరల్ అవుతుంది.
చిన్నప్పుడు తెలుగు సినిమాల్లో క్యూట్ గా పద్దతిగా కనిపించిన అవంతిక.. ఇప్పుడు ఆ హాలీవుడ్ సినిమాల్లో అందాల ఆరబోస్తూ హాట్ హాట్ గా కనిపిస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. మహేష్ బాబుకి అభిమాని అయిన అవంతిక.. 'బ్రహ్మోత్సవం' సినిమా సమయంలో మహేష్ తో ఓ క్యూట్ ఇంటర్వ్యూ కూడా చేసింది. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ వీడియో, 'మీన్ గర్ల్స్' మూవీలో అవంతిక హాట్ పెర్ఫార్మెన్స్ వీడియోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు.
Next Story