Mon Dec 23 2024 11:38:07 GMT+0000 (Coordinated Universal Time)
అవతార్ 2 కి తప్పని లీకుల బెడద.. ఆన్లైన్లో ఫుల్ మూవీ
హాలీవుడ్ సినీ పరిశ్రమ గురించి చెప్పాలంటే.. అవతార్ కి ముందు.. అవతార్ కి తర్వాత అని చెప్పాలి. 2009లో విడుదలైన..
ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ప్రతిష్టాత్మకంగా తీసిన అవతార్ 2 సినిమా.. నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కానీ.. రిలీజ్ కు ముందే సినిమా మొత్తం ఆన్లైన్లో లీకవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. 25 కోట్ల అమెరికన్ డాలర్లతో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా విడుదలకు ముందే లీకవ్వడం షాకయ్యేలా చేసింది. థియేటర్లలో సినిమాను 3డి, 2డి ల్లో చూసేందుకు అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకున్నవారందరికీ ఇది దిమ్మతిరిగే షాక్ అని చెప్పాలి. ఆన్లైన్లో సినిమాను చూడటమే కాకుండా.. సినిమా ఎలా ఉందో కూడా రివ్యూలు ఇచ్చేస్తున్నారు.
హాలీవుడ్ సినీ పరిశ్రమ గురించి చెప్పాలంటే.. అవతార్ కి ముందు.. అవతార్ కి తర్వాత అని చెప్పాలి. 2009లో విడుదలైన అవతార్.. అప్పటి వరకూ ఉన్న రికార్డులన్నింటినీ తుడిచి పెట్టేసి ఓ మైలురాయిని చేరుకుంది. మళ్లీ తనతో తానే పోటీగా వచ్చింది అవతార్ 2. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదలై.. ఊహించని రీతిలో వసూళ్లు రాబడుతుందని అంచనా. 13 ఏళ్ల తర్వాత వచ్చిన సీక్వెల్ మూవీనే అయినా.. ఆడియన్స్ లో ఆసక్తి తగ్గలేదు. కానీ థియేటర్ కు వెళ్లకుండానే సినిమా లీకవ్వడంతో.. వసూళ్లకు కాస్త గండిపడినట్లైంది.
Next Story