Mon Dec 23 2024 12:12:21 GMT+0000 (Coordinated Universal Time)
వసూళ్లలో దూసుకెళ్తున్న అవతార్ 2 .. 15 రోజుల వసూళ్ల వివరాలివిగో..
డిసెంబర్ 16న ఏకంగా 160 భాషల్లో విడుదలై సంచలనం సృష్టించిన అవతార్ 2.. తెలుగు ఆడియన్స్ నూ ఆకట్టుకుంది. తెలుగు రాష్ట్రాల్లో..
హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన విజువల్ వండర్ అవతార్ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అవతార్ విడుదలైన 13 ఏళ్లకు రెండో పార్ట్ రిలీజ్ అవగా.. భారీ ఓపెనింగ్స్ తో అదరగొట్టింది. విడుదలై 15 రోజులైనా.. ఇప్పటికీ అదే దూకుడుతో దూసుకుపోతోంది. యావత్ ప్రపంచం ఎంతో ఆతృతగా ఎదురుచూసిన ఈ సినిమా డిసెంబర్ 16న గ్రాండ్ గా రిలీజ్ అయింది. గతంలో వచ్చిన అవతార్ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు జేమ్స్ కామెరూన్.
డిసెంబర్ 16న ఏకంగా 160 భాషల్లో విడుదలై సంచలనం సృష్టించిన అవతార్ 2.. తెలుగు ఆడియన్స్ నూ ఆకట్టుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మొదటి రోజుకే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇండియా వైడ్ గా రూ.300.90 కోట్ల నెట్ కలెక్షన్లను,రూ.347.88 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. 15 రోజులకు గాను.. నైజాం రూ.26.84 కోట్లు, సీడెడ్ రూ.5.88 కోట్లు, ఉత్తరాంధ్ర రూ.6.66 కోట్లు, ఈస్ట్, వెస్ట్ కలిపి రూ.2.91 కోట్లు, కృష్ణా , గుంటూరు కలిపి రూ.5.46 కోట్లు, నెల్లూరు రూ.2.51 కోట్లు, మొత్తంగా ఏపీ, తెలంగాణ కలిపి రూ.50.26 కోట్లు వసూలు చేసింది అవతార్ 2.
Next Story